స్టార్ హీరోయిన్లు కెరీర్లో మంచి స్థితిలో ఉండగా తమ ప్రేమాయణాల గురించి బయటపెట్టరు. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నా.. దాని గురించి మీడియాలో వార్తలు వచ్చినా.. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే బుకాయిస్తుంటారు. లేదా నో కామెంట్ అని తప్పించుుకంటూ ఉంటారు.
రిలేషన్‌షిప్ గురించి ఒప్పేసుకుంటే, పెళ్లి ప్రణాళికల గురించి బయటపెడితే అది కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తారు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడింది. దాని గురించి ఓపెన్‌గా ప్రకటన చేసింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇక అప్పట్నుంచి ఇద్దరూ స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ ఇబ్బందీ లేకుండా తిరిగేస్తున్నారు.
ఐతే మిగతా హీరోయిన్లకు భిన్నంగా ఇలా రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అవడానికి కారణమేంటో రకుల్ వెల్లడించింది. “కొందరు తమ ప్రేమను బయట పెట్టేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ నేను వారిలా పిరికిదాన్ని కాదు. సినిమాల్లో నటించినట్టుగా నిజ జీవితంలో నటించలేను. నిజాయితీగా ఉండాలనుకుంటాను. జీవితానికి ఓ తోడు కావాలి. జాకీ, నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాం. భయం వల్ల కొందరు కొన్ని విషయాలు దాచి, పలు సమస్యల్లో చిక్కుకుంటారు. నాకు భయం లేదు. అందుకే నా ప్రేమను దాచిపెట్టలేదు” అని రకుల్ స్పష్టం చేసింది.
త్వరలోనే రకుల్, జాకీ పెళ్లి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రకుల్ నటించిన తాజా చిత్రం ‘డాక్టర్ జీ’ శుక్రవారమే రిలీజైంది. ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.ప్రస్తుతం రకుల్ ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ‘అయలాన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
This post was last modified on October 16, 2022 3:44 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…