క్రాక్ సూపర్ హిట్ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలతో బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్లు అందుకున్న మాస్ మహారాజా రవితేజ ఆశలన్నీ రాబోయే ధమాకా మీదే ఉన్నాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్. ఇప్పటికే దించక్ పాట యూట్యూబ్ తో పాటు ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ ని ఊపేస్తోంది. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న టీమ్ ట్రైలర్ తో పాటే దాన్ని రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి దీని మీద భీభత్సమైన బజ్ లేదు కానీ ఉన్నంతలో ఫ్యాన్స్ కనీస గ్యారెంటీ ఉన్న కంటెంట్ ని ఆశిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే రవితేజ తమిళంలో సూపర్ హిట్ అయిన మానాడు రీమేక్ కు ఓకే చెప్పారనే వార్త ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. దీని హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ వద్ద ఉన్నాయి. స్క్రిప్ట్ బాధ్యతలు దర్శకుడు హరీష్ శంకర్ కు ఇచ్చారట. దాదాపుగా పూర్తయ్యే స్టేజిలో ఉందని అంటున్నారు. దర్శకత్వ బాధ్యతలు చాలా కాలం నుంచి కనిపించకుండా ఉన్న దశరధ్ కు ఇచ్చే ఛాన్స్ ఉందని వినికిడి.
వెంకటేష్ నారప్పకు ఇలాగే శ్రీకాంత్ అడ్డాలను తీసుకొచ్చి సేఫ్ గేమ్ ఆడిన నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు ఈ మనాడుకు కూడా అదే ఫార్ములాని ఆపాదించబోతున్నారు. ఇంకా అఫీషియల్ కాలేదు.
వినడానికి బాగానే ఉంది కానీ మానాడులో శింబు చేసిన పాత్ర సిద్దు జొన్నలగడ్డకు ఇచ్చారట. అంటే రవితేజ ఎస్ జె సూర్య అదరగొట్టిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా రిస్కే. అందులో ఎన్ని షేడ్స్ ఉన్నా, పెర్ఫార్మన్స్ కు ఎంత గొప్ప అవకాశమున్నా హీరో అయితే కాదు. మరి మాస్ రాజా నిజంగా ఒప్పుకున్నాడా లేక చేసే తీరాలి అనిపించేలా హరీష్ శంకర్ ఏమైనా మార్పులు చేశాడా అధికారిక ప్రకటన వచ్చాకే క్లారిటీ వస్తుంది. చిరంజీవి వాల్తేర్ వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావులను లైన్ లో పెట్టిన రవితేజ వచ్చే ఏడాది కూడా కనీసం నాలుగు సినిమాలు చేసేలా ప్లానింగ్ లో ఉన్నాడు
This post was last modified on October 16, 2022 12:30 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…