తెలుగులో గత మూణ్నాలుగు దశాబ్దాల్లో దర్శకులైన ప్రతి ఒక్కరికీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే గోల్ ఉండుంటుంది. కానీ చాలా తక్కువ మందికే ఆ అవకాశం దక్కింది. ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య చిరు కొందరు దర్శకులకు వారి స్థాయి, ట్రాక్ రికార్డు చూడకుండా అవకాశాలు ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మోహన్ రాజా, బాబీ, మెహర్ రమేష్ ఇలాగే చిరుతో పని చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
ఈ జాబితాలోకి వెంకీ కుడుముల పేరు కూడా చేరింది కొంత కాలం కిందట. ఛలో అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత భీష్మ లాంటి మిడ్ రేంజ్ మూవీ తీసిన వెంకీకి చిరుతో సినిమా చేసే అవకాశం రావడం మామూలు విషయం కాదు. అందుకతను చాలా ఎగ్జైట్ అయ్యాడు. మధ్యలో ఈ సినిమాపై సందేహాలు వ్యక్తమైనా వెంకీ ధీమాగానే కనిపించాడు. దీంతో ఈ ప్రాజెక్టు పక్కా అనే అనుకున్నారంతా.
కానీ వెంకీతో చిరు సినిమా చేయట్లేదన్నది తాజాగా తెలిసిన సమాచారం. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ అయినందుకు తనను కలిసిన మీడియా వాళ్లతో మాట్లాడుతున్నపుడు వెంకీతో సినిమా లేదని చిరు చెప్పకనే చెప్పేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమా గురించి అడిగితే మాట దాటవేయడాన్ని బట్టి వెంకీతో చిరు సినిమా లేదని దాదాపుగా తేలిపోయినట్లే.
చిరు ఛాన్స్ ఇచ్చేసరికి రెండేళ్లుగా ఇంకో సినిమా గురించి ఆలోచించకుండా దీని మీదే దృష్టిపెట్టాడు వెంకీ. కానీ ఫలితం లేకపోయింది. చిరును తన స్క్రిప్టుతో మెప్పించలేకపోయాడు. మీడియాకు తెలియకముందే చిరుతో సినిమా లేదని వెంకీకి తెలిసింది. దీంతో అతను ఆల్రెడీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాడు. తాను భీష్మతో మంచి హిట్ ఇచ్చిన నితిన్‌తోనే మరో సినిమా చేసేందుకు వెంకీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. భీష్మ తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తిన్న నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత వెంకీతో అతను జట్టు కట్టొచ్చు.
This post was last modified on October 15, 2022 2:47 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…