Movie News

సినిమాలు ఫుల్లు – కలెక్షన్లు నిల్లు

మొన్న దసరాకి గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలు సందడి చేశాక ఈ వారం అంతకు మించి అనే స్థాయిలో ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లను పలకరించాయి. నెంబర్ అయితే ఘనంగా ఉంది కానీ నిన్న ఫ్రైడే సందడి ఎక్కడా కనిపించకపోవడం ట్రేడ్ ని నిరాశలో ముంచెత్తింది.

ఉన్నవాటిలో కాస్త ప్రమోషన్లు ఎక్కువగా చేసుకున్న ఆది సాయికుమార్ సిల్లీ ఫెలో, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ లకు కొద్దోగొప్పో జనం వచ్చారు కానీ మిగిలినవాటికి కనీసం థియేటర్ రెంట్లు గిట్టుబాటు అయ్యేంత కలెక్షన్ కూడా రాలేదు. కారణం దేనిమీదా కనీస స్థాయిలో అంచనాలు లేకపోవడమే. ప్రధాన కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి.

ఇక టాక్ గురించి చెప్పుకోకపోవడం ఉత్తమం. బాగానే ఉందని ఏదీ అనిపించుకోలేదు. అసలు స్టార్లు చేసిన యావరేజ్ కంటెంట్లే అంతంత మాత్రంగా ఆడుతుంటే ఎలాంటి ఆకర్షణలు లేని చిన్న బడ్జెట్ చిత్రాలకు టికెట్ కౌంటర్ల దగ్గర పబ్లిక్ ని ఆశించడం అత్యాశే.

ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఎప్పడూ చూడనిది ఏదో ఉందట అనిపించినా జనం కదులుతారు కానీ సోసో ఎంటర్ టైన్మెంట్ కి కాసులు రాలే కాలం కాదిది. అంతకు ముంచు డీసెంట్ రిపోర్ట్స్ తెచ్చుకున్న కృష్ణ వృందా విహారి సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో రాబట్టుకోలేక చేతులెత్తేయడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. బాగుందని చెప్పినా సరే స్వాతిముత్యంకు రాలేదు.

ఒక్క కాంతారా మీద మాత్రమే పాజిటివ్ బజ్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు. ప్యూర్ కన్నడ నేటివిటీ కావడంతో మన ఆడియన్స్ ఇంకా పూర్తి స్థాయిలో దీనివైపు మొగ్గు చూపడం లేదు.

రివ్యూలు గట్రా ఎక్స్ ట్రాడినరీగా ఉన్నాయి. ప్రభాస్ ఏకంగా రెండుసార్లు చూశాడు. సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు చాలా మంది ట్వీట్లు పెట్టారు. ఇంత పెద్ద అడ్వాంటేజ్ ని కాంతారా ఎలా వాడుకుంటుందో చూడాలి. హఠాత్తుగా సోమవారం నుంచి నెమ్మదించిన గాడ్ ఫాదర్ ఆశలు కూడా ఈ రెండు రోజుల వీకెండ్ మీదే ఉన్నాయి.

This post was last modified on October 15, 2022 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డిపోర్ట్ గాదలు.. యూస్ వెళ్లిన విషయం కూడా తెలియదట!

అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…

9 minutes ago

రాజా సాబ్ అందుకే ఆలోచిస్తున్నాడు

ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…

1 hour ago

“జానీ ఫలితం పవన్ కి ముందే అర్థమైపోయింది” : అల్లు అరవింద్

ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…

2 hours ago

సందీప్ వంగా చుట్టూ ‘మెగా’ కాంబో పుకార్లు

ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…

2 hours ago

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…

2 hours ago

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

2 hours ago