నిన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బర్తడే సందర్భంగా.. ఆమెతో దిగిన రెండు సెల్ఫీలను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్తడే అంటూ విషెస్ చెప్పాడు టాలెంటెడ్ దర్శకుడు హరీశ్ శంకర్. అక్కడితే ఆపలేదు. త్వరలోనే సెట్స్ కి వెళిపోదాం నీకోసం వెయింటింగ్ అన్నట్లు తన ట్వీట్లో యాడ్ చేశాడు. మరి హరీశ్ శంకర్ అప్పట్లో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే అంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాన్ తో చేయాల్సిన సినిమా కోసం హరీశ్ ఇంకా వెయిట్ చేస్తున్నాడా?
ఇప్పటివరకు రెండుసార్లు పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని మొదలుపెట్టే వరకు తీసుకొచ్చింది మైత్రీ మూవి మేకర్స్. కాని రెండుసార్లూ ఆ ప్రయత్నం ఫలించలేదు. రీసెంటుగా హరీశ్ శంకర్ డైరక్షన్లో భవదీయుడు భగత్ సింగ్ అంటూ ప్రకటించారు కూడా. కాని పవన్ కు రాజకీయంగా ఖాళీ లేకపోవడంతో ఆయన ముందు భీమ్లా నాయక్ పూర్తి చేసుకన్నాడు. ఇప్పుడేమో హరిహర వీరమల్లు ఫినిష్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తో వినోదాయ సితం రీమేక్ ను పూర్తి చేస్తాడట. ఆ లెక్కన హరీశ్ శంకర్ సినిమా ఇప్పుడప్పుడే అసలు పట్టాలెక్కే ఛాన్సే లేదు. కాని మన దర్శకుడు మాత్రం ఇంకా పవన్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నాడని పూజా హెగ్డే కోసం చేసిన ట్వీట్ ను బట్టి అర్దంచేసుకోవచ్చు.
మరో ప్రక్కన గబ్బర్ సింగ్, మిరపకాయ్ వంటి సినిమాలను విపరీతంగా ఆదరించిన ఫ్యాన్స్ మాత్రం.. అసలు పవన్ కళ్యాణ్ దొరక్కపోతే వేరే హీరోతో హరీశ్ సినిమా ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. నిజానికి టాప్ హీరోలందరూ పెద్ద పెద్ద సినిమాలతో బిజీ. సెకండ్ గ్రేడ్ స్టార్లతో చేయడం హరీశ్ కు కూడా ఇష్టంలేనట్లుంది. అందుకే మనోడు ఎవరన్నా సూపర్ స్టార్ తోనే సినిమా చేస్తాను అంటూ వెయిట్ చేస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. కాకపోతే కెరియర్లో మరీ లాంగ్ గ్యాప్స్ తీసుకుంటే కూడా దర్శకులను జనాలు మర్చిపోయే ఛాన్సుంది. కాదంటారా?
This post was last modified on October 14, 2022 2:50 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…