కొంతమంది హీరోలు ఒక టైప్ కంటెంట్ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ చూసేస్తారు అని ఫిక్సయిపోయారు. ఓటిటిలో కంటెంట్ ఎక్కువగా చూస్తన్నారంటే అందుకు కారణం అక్కడున్న న్యుడిటీ, మితిమీరిన కిస్సింగ్ సీన్స్ అనుకుంటున్నారు. అందుకే హిట్లు లేక సతమతమవుతున్న చాలామంది హీరోలు ఇప్పుడు తమ సినిమాల్లో లిప్ కిస్ సీన్స్ అనేవి తెగ పెట్టేస్తున్నారు.
మొన్నామధ్యన డిజె టిల్లులో కూడా సిద్దూ జొన్నలగడ్డ ఇదే తరహాలో నేహా శెట్టితో పెదాలు పెనవేశాడు. దానితో కిరణ్ అబ్బవరం కూడా చాందిని చౌదరితో సమ్మతమే సినిమాలో అలాంటి ప్రయత్నమే చేశాడు. చివరకు రవితేజ కూడా పాటల్లో హీరోయిన్ల పెదాలను పెనవేస్తున్నాడు. ఖిలాడి అండ్ రామారావ్ ఆన్ డ్యూటిలో అవే చూపించాడు. కాని సినిమా రిజల్ట్ ఈ కిస్సింగ్ మీద ఆధారపడి ఉండదని సదరు సినిమాల రిజల్ట్ చూస్తే మనకూ అర్ధమవుతుంది.
హిట్ అనే పదానికి చాలాకాలం నుండి దూరంగా ఉంటున్న సందీప్ కిషన్ కూడా.. ‘మైఖేల్’ సినిమా కోసం దివ్యాన్ష కౌశిక్ కు ఒక ఘాటైన లిప్ కిస్ ఇచ్చేసి.. అదే పోస్టరుతో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. నిజానికి ఈ సుందరి ఏ ముహూర్తాన మజిలి సినిమాలో నాగచైతన్యతో లిప్ లాక్ చేసిందో కాని, ఆ తరువాత రామారావు ఆన్ డ్యూటి సినిమాలో రవితేజతో ఇప్పుడు మైఖేల్ కోసం సందీప్ తో అదే పని చేసింది. కాకపోతే పోస్టర్లోనే లిప్ లాక్ పోస్టర్ వేసి జనాలను ఎట్రాక్ట్ చేయడం అనేది చాలా పాత తరహా పద్దతి. ఇలాంటి పప్పులేమీ ఇప్పుడు ఆడియన్స్ దగ్గర్ వర్కవుట్ కావట్లేదు. కేవలం ఇలా కిస్సింగ్ ను నమ్ముకుంటే మాత్రం కష్టమే మాష్టారూ.
ఇకపోతే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కూడా నట్టిస్తున్నారు కాబట్టి.. వారి వలన సినిమాకు మాంచి హైప్ వచ్చే ఛాన్సుంది. మేబి ట్రైలర్ రిలీజ్ గురించి ప్రకటించడానికి రిలీజ్ చేసిన పోస్టర్లో వాళ్ళను పెట్టుంటే బాగుండేదేమో.
This post was last modified on October 14, 2022 2:43 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…