పోయినేడాది ఈ టైంకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘మా’ ఎన్నికల గురించే చర్చంతా. సాధారణ ఎన్నికల స్థాయిలో ఈ ఎలక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. అనూహ్య మలుపులు తిరిగిన ఈ ఎన్నికల రణరంగంలో చివరికి మంచు విష్ణునే పైచేయి సాధించాడు. ప్రకాష్ రాజ్‌కు ఓటమి బాధ తప్పలేదు. ఎన్నికల తర్వాత కూడా కొన్ని అనూహ్య పరిణామాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది ‘మా’.
ఎన్నికలు జరిగిన తీరును నిరసిస్తూ ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఆయన ప్యానెల్ నుంచి వివిధ పదవులకు పోటీ చేసి గెలిచిన వాళ్లు కూడా వాటికి రాజీనామా చేసేయడం తెలిసిందే. కొన్ని రోజులు వేచి చూశాక ప్రకాష్ రాజ్ ప్యానెల్ కోరుకున్నట్లే వారిని దూరంగా పెట్టేసింది మంచు విష్ణు వర్గం. ‘మా’ సభ్యత్వాన్ని వదులుకోవాలన్న ప్రకాష్ రాజ్ నిర్ణయంపై పునరాలోచించాలని అన్నారే తప్ప.. ఆయన సభ్యత్వం ఉందా లేదా అన్న విషయంలో క్లారిటీ లేకుండానే ఈ వ్యవహారం చల్లబడిపోయింది.
కాగా ‘మా’ అధ్యక్షుడిగా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తన విజయాలతో పాటు వివిధ అంశాలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మంచు విష్ణు.. కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించాడు. ‘మా’ సభ్యత్వం ఉన్న వాళ్లే తెలుగు సినిమాల్లో నటించేలా నిర్మాతలకు సూచించినట్లు వెల్లడించాడు. అలాగే ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా తెలిపాడు. ‘మా’కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా పోటీకి అనర్హులవుతారని.. అలాగే ‘మా’కు వ్యతిరేకంగా ధర్నాలు చేసినా, మీడియాకు ఎక్కినా వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తామని కూడా ప్రకటించాడు.
ఈ నిర్ణయాలన్నీ చూస్తుంటే.. ప్రకాష్ రాజ్ మళ్లీ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్రేక్ వేసే వ్యూహం లాగా కనిపిస్తోంది. ఆయన నిజంగా సభ్యత్వాన్ని వదులుకుని ఉంటే మళ్లీ ఎన్నికల సమయానికి వచ్చి పోటీకి సై అంటే కుదరదు అనేలాగా ‘మా’ మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ‘మా’కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా అనర్హులవుతారని అనడం.. మధ్యలో ప్రకాష్ రాజ్ సహా ఎవ్వరూ నోరెత్తకుండా చేయడమే అంటున్నారు. ఈ పరిణామాలపై ప్రకాష్ రాజ్, ఆయన మద్దతుదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 14, 2022 11:28 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…