Movie News

నానికి క్యూ కట్టిన షాకులు

న్యాచురల్ స్టార్ నానికి బ్యాడ్ టైం నడుస్తోంది. కథల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఫలితాలు మాత్రం ప్రతికూలంగా వస్తున్నాయి. వెండితెర మీదే కాదు బుల్లితెరపై కూడా ట్విస్టులు తప్పడం లేదు. తాజాగా అంటే సుందరానికి వరల్డ్ టీవీ ప్రీమియర్ కు కేవలం 1.88 టిఆర్పి రావడం పట్ల శాటిలైట్ ఛానల్ వర్గాలు షాక్ తిన్నాయి. ఇమేజ్ ఉన్న హీరోకి ఇంత తక్కువ నెంబర్ నమోదు కావడం ఈ మధ్య కాలంలో ఇదే ఫస్టు. డిజాస్టర్ అయినా సరే టీవీలో మొదటిసారి టెలికాస్ట్ జరిగినప్పుడు జనం బాగానే చూస్తారు. కానీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రచారం జరిగిన అంటే సుందరానికి ఇలా జరగడం ట్విస్టే.

ఇదే కాదు నాని ట్రాక్ రికార్డు గత కొంతకాలంగా ఇలాగే నడుస్తోంది. ఎంతో కష్టపడి నెగటివ్ టచ్ ఉన్నవి చేస్తే అది ఓటిటిలో వచ్చినా విమర్శలు అందుకుంది. ప్రెస్ మీట్లలో మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పుకోవచ్చు కానీ ఆ సినిమా బాగుందన్న ఆడియన్స్ ఎక్కడా కనిపించరు. తన రెగ్యులర్ స్కూల్ కు వచ్చి చేసిన టక్ జగదీష్ సైతం అదే ఫలితాన్ని అందుకుంది. శ్యామ్ సింగ రాయ్ ఒక్కటే ఊరట కలిగించేలా మంచి విజయం అందుకుంది. పుష్ప హవాలోనూ తట్టుకుని నిలబడింది. దానికి కూడా నాని చాలా పెద్ద రేంజ్ ఫలితాన్ని ఆశించాడు. హిట్టే కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోవడమే కారణం.

కట్ చేస్తే ఇప్పుడీ అంటే సుందరానికి ఇలాంటి ఝలక్. అందుకే కంప్లీట్ మేకోవర్ తో ఊర మాస్ అవతారంలోకి వెళ్లి చేస్తున్న దసరా మీదే నాని ఫ్యాన్స్ ఆశలన్నీ. ఇటీవలే రిలీజ్ చేసిన ఆడియో సింగల్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. బడ్జెట్ ఎక్కువవుతున్నా నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. శాటిలైట్, ఓటిటి, డబ్బింగ్ హక్కులకు డిమాండ్ ఉండటంతో టేబుల్ ప్రాఫిట్స్ ఖాయంగానే కనిపిస్తున్నాయి. తన కంఫర్ట్ జానర్ నుంచి బయటికి వచ్చి నాని చేస్తున్న ఈ ప్రయత్నం కనక వర్కౌట్ అయితే మార్కెట్ విస్తరించే అవకాశం పుష్కలంగా ఉంది.

This post was last modified on October 13, 2022 8:07 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

21 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

35 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

37 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago