బాలీవుడ్ ని శాసించే నిర్మాతలలో ఒకడైన కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ కూడా అతడిని ఎఫెక్ట్ చేయవు. చాలా జోవియల్ గా ఉండే కరణ్ ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాక సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయిపోయాడు.
సుశాంత్ మరణానికి తనే కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు… నువ్వు కూడా అతడిలా చనిపోవాలంటూ కొందరు ట్వీట్స్ పెట్టడంతో కరణ్ తీవ్రంగా కలత చెందాడట. సుశాంత్ మరణించిన దగ్గర్నుంచీ కరణ్ ఏడుస్తూనే ఉన్నాడని అతని సన్నిహితుడు ఒకరు మీడియాకు చెప్పాడు. కరణ్ ఎందుకు స్పందించడం లేదంటే… ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఉండడమే ఉత్తమం అని లాయర్ సూచించడంతో కరణ్ మాట్లాడ్డం లేదట.
అసలు సుశాంత్ మరణంతో సంబంధం లేని చాలా మందిని సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందని, అకారణంగా ఆలియా భట్, అనన్య పాండే, సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అతను అన్నాడు. సుశాంత్ మరణానికి కారణం తెలియకపోయినా కానీ… బాలీవుడ్ లో వేళ్ళూనుకుపోయిన బంధు ప్రీతి అతడిని చంపేసిందని, కనుక సినీ వారసులంతా అతని మరణానికి బాధ్యులే అనేది సుశాంత్ ఫాన్స్ ఆరోపణ.
This post was last modified on July 9, 2020 7:07 pm
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…