Movie News

క‌ళ్యాణ్ రామ్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తే ఇక తిరుగుండ‌దు!

నందమూరి వంటి బడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే కళ్యాణ్ రామ్ తనదైన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల ఆయన ‘బింబిసార’ మూవీతో అందరిని పలకరించాడు.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న సోసియో ఫాంటసీ మూవీ ఇది. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. వసూళ్ళ పరంగా ఈ చిత్రం ఎన్నో రికార్డులు సైతం సృష్టించింది.

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో ‘బింబిసార 2’, ‘డెవిల్’ చిత్రాలు ఉన్నాయి. డెవిల్ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తుండగా.. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కళ్యాణ్ రామ్ ఇటీవల తన 19వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. NKR 19 వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడ‌ని జోరుగా టాక్ న‌డుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ చాలా వ‌ర‌కు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మ‌రికొద్ది రోజుల్లో ఆఖ‌రి షెడ్యూల్ సైతం ప్రారంభం కాబోతోంది. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల ఉండొచ్చ‌ని అంటున్నారు.

అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉండ‌బోతోంద‌న్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకున్న సందర్భమే లేదు. కెరీర్ ఆరంభం నుంచి ఆయనకు ఒక హిట్ పడ్డాక వరుసగా ఫ్లాపులు పడుతున్నాయి. దీంతో హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ కు ప్లాపులు ఖాయం అనే బ్యాడ్ సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది.

ఇక ఇటీవల విడుదలైన ‘బింబిసార‌’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆయన నుంచి నెక్స్ట్ రాబోయే ‘ఎన్ఆర్‌కె 19’ రిజ‌ల్ట్ పై అభిమానుల్లో టెన్షన్ నెలకుంది. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధిస్తే కళ్యాణ్ రామ్ హిట్ తర్వాత ఫ్లాప్ అనే బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడు. అదే జరిగితే ఇక ఆయన కెరీర్ కు తిరుగుండదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

This post was last modified on October 13, 2022 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

19 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago