కొత్త సినిమాలు రిలీజై మంచి విజయం అందుకున్నాక దర్శకులకు నిర్మాతలు కార్లను గిఫ్టుగా ఇవ్వడం మామూలే. ఇందుకు టాలీవుడ్లో చాలా ఉదాహరణలే ఉన్నాయి. దీన్నొక ప్రమోషన్‌గా ఉపయోగించుకోవడం కూడా చూస్తుంటాం. ఐతే సినిమా రిలీజ్ కంటే ముందే దర్శకుడికి నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. అందులోనూ ఒక చిన్న హీరోను పెట్టి తీసిన చిన్న చిత్రానికి దర్శకుడు కారును బహుమతిగా అందుకోవడం విశేషమే.
‘హృదయ కాలేయం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి.. ఆ తర్వాత కొబ్బరిమట్ట, కలర్ ఫొటో చిత్రాలను నిర్మించిన సాయి రాజేష్ జఈ జాబితాలో చేరాడు. అతను దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘బేబీ’ ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోయిన నిర్మాత ఎస్కేఎన్, సమర్పకుడు మారుతి కలిసి.. ఎంజీ హెక్టార్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర రూ.15 లక్షలు కావడం విశేషం.
ఈ సినిమా రేంజికి ఇది దర్శకుడికి దక్కిన పెద్ద బహుమతిగానే భావించాలి. ‘బేబీ’ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. సాయి రాజేష్ కథ అందించిన ‘కలర్ ఫొటో’ ఆహాలో రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక.. జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకోవడంతో ‘బేబీ’ మీద అంచనాలు పెరిగాయి.
‘కలర్ ఫొటో’లో మాదిరే ఇందులోనూ కథాంశం హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ‘బేబీ’కి ఆల్రెడీ మంచి బజ్ ఉండగా.. హైప్ ఇంకా పెంచే ఉద్దేశంతో కూడా ఇలా దర్శకుడికి కారును బహుమతిగా ఇచ్చి ఉండొచ్చు. త్వరలోనే ‘బేబీ’ టీజర్ లాంచ్ కాబోతోంది. అది చూస్తే సినిమా సత్తా ఎంత అన్నది ఒక అవగాహన వచ్చేస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 13, 2022 12:14 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…