Movie News

హాలిడేకి వెళ్లొచ్చినా రష్మిక అదే పాట పాడింది

మాల్డీవ్స్ లో తన ఐదు రోజుల హాలిడే ముగించుకుని తిరిగొచ్చింది రష్మిక మందన్న. తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలసి ఆమె ఐదురోజుల పాటు ఒక బీచ్ రీసార్ట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వెళ్లే ముందు తను విజయ్ కేవలం స్నేహితులమే అని చెప్పిన ఈ కన్నడ సుందరి, ఇప్పుడు తిరిగొచ్చేటప్పుడు కూడా ఎయిర్ పోర్టులో పోటోగ్రాఫర్లతో అదే పాట పడింది. కలసి ఒక ఫోటో దిగండి అంటే మాత్రం, మేం జస్ట్ ఫ్రెండ్స్ అనేసింది. ఇప్పుడు దీని గురించే బాలీవుడ్లో కూడా చర్చలు జరుగుతున్నాయ్.

నిజానికి బాలీవుడ్లో చాలామంది లవ్ బర్డ్స్ ప్రేమలో ఉన్నప్పుడు ఒప్పేసుకుంటారు, బ్రేకప్ అయిన తరువాత హానెస్ట్ గా మ్యాటర్ చెప్పేసుకుంటారు. కాని మన దగ్గర మాత్రం పెళ్ళికి వారంరోజుల ముందు వరకు కూడా సమంత అండ్ నాగ్ చైతన్య కూడా తాము కేవలం స్నేహితులమనే చెప్పారు. ఇప్పుడు రష్మిక కూడా బాలీవుడ్లో సినిమాలు చేస్తున్నా కూడా మేం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెబుతుంటే ఎవ్వరికీ కిక్ రావట్లేదు.

వీళ్ళు కేవలం స్నేహితులు కాదు, గాళ్‌ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ కరణ్‌ జోహార్ ‘కాఫీ విత్ కరణ్‌’ ప్రోగ్రాములో పాల్గొన్న ఝాన్వి కపూర్, సారా ఆలీ ఖాన్.. అప్పట్లో చెప్పకనే చెప్పారులే. ఆల్రెడీ విజయ్ కు గాళ్ ఫ్రెండ్ ఉందంటూ కరణ్‌ జోహార్ కూడా చాలాసార్లు హింట్లు ఇచ్చేశాడు. పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని లోకం చీకటిగా ఉందన్నట్లు.. వీళ్లు ఎంతసేపూ మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటే మన దగ్గర అందరూ నమ్మేసినా కూడా బాలీవుడ్లో నమ్మట్లేదు.

ఒకవేళ నిజంగానే ఫ్రెండ్స్ అయితే మాల్డీవ్స్ నుండి కనీసం కలసి ఒక్క పిక్ కూడా షేర్ చెయ్యరా అంటూ అందరూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక బాలీవుడ్లో అయితే ఇద్దరూ కలసి ఒకేసారి.. షార్ట్ గ్యాపులో లైగర్ అండ్ గుడ్ బాయ్ అంటూ ఫ్లాపులను చవిచూసి.. కలసి మాల్డీవ్స్ ఫ్లయిట్ ఎక్కేసి.. ఒక మలైకా అరోరా అండ్ అర్జున్ కపూర్ తరహాలో రచ్చ చేస్తున్నారంటూ అక్కడి మీడియా ఇప్పుడు వీళ్లపై విరుచుకుపడుతోంది. ఏదేమైనా కూడా రష్మిక పాట జనాలకు నచ్చలేదని తెలుస్తోంది.

This post was last modified on October 13, 2022 11:25 am

Share

Recent Posts

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

56 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 hour ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago