కృతి శెట్టి.. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి ఉప్పెనలా దూసుకొచ్చిన అమ్మాయి కృతి శెట్టి. నిజానిని ఆ సినిమాలో వేరే హీరోయిన్ లీడ్ రోల్ చేయాల్సింది. ప్రారంభోత్సవంలో పాల్గొంది కూడా ఆ అమ్మాయే. కానీ తను ఈ చిత్రానికి సెట్టవ్వదని భావించి, తర్వాత ఆమె తప్పించి కృతిని ఎంచుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు.
‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్టయిందో, కృతికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో వరుసగా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ‘ఉప్పెన రిలీజై రెండేళ్లు తిరక్కుండానే ఐదు సినిమాలు రిలీజయ్యాయి కృతివి.
అందులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు బాగానే ఆడాయి కానీ.. ఇటీవల వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది కృతి. రెండు నెలల వ్యవధిలో ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో షాక్‌ల మీద షాక్‌లు తింది ఈ అమ్మాయి. ఈ చిత్రాల్లో ఆమె అప్పీయరెన్స్, నటన విషయంలో విమర్శలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో కృతి కెరీర్ ఏమవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఐతే తెలుగులో కృతికి కొత్తగా సినిమా అవకాశాలేమీ వస్తున్నట్లు కనిపించడం లేదు కానీ.. ఆమె నెమ్మదిగా వేరే భాషల్లో బిజీ అవుతోంది. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు కమిటైంది కృతి. అందులో ఒకటి అక్కినేని నాగచైతన్యతో వెంకట్ ప్రభు రూపొందించబోయే ద్విభాషా చిత్రం. అది కాక సూర్య సరసన ‘వానంగాన్’ అనే భారీ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు మలయాళంలో కూడా అవకాశం దక్కించుకుంది.
మలయాళంలో ప్రస్తుతం మంచి ఊపుమీదున్న యువ కథానాయకుడు టొవినో థామస్ సరసన కృతి నటించబోతోంది. అతను హీరోగా ‘అజయంటే రాండం మోషనం’ అనే సినిమా మొదలైంది. జితిన్ లాల్ అనే దర్శకుడు రూపొందిస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా ఇది. మిన్నల్ మురళి, తల్లుమాల.. ఇలా వరుసగా బ్లాక్‌బస్టర్లు కొట్టి మంచి ఊపుమీదున్న టొవినో సరసన కృతి ఛాన్స్ దక్కించుకుందంటే తన అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.
This post was last modified on October 12, 2022 9:55 pm
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…