సినీ రంగంలో కొంతమంది ఎంత ఇబ్బంది వచ్చినా సరే.. ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమా చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు మంచి ఫలితాలు రావచ్చు. కొన్నిసార్లు రిజల్ట్ తేడా కొట్టొచ్చు. అదే సమయంలో మాట కోసం ఆలోచిస్తే.. సినిమా తేడా కొట్టి అసలుకే మోసం వస్తుందని ఆలోచించి వెనక్కి తగ్గే వాళ్లూ ఉంటారు.
ఒకే వ్యక్తి సందర్భాన్ని బట్టి రెండు రకాలుగా ప్రవర్తించడం కూడా జరుగుతుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి ఆ సినిమా విషయంలో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత అతను ‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా అరంగేట్రం చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇదే ఎన్లీఆర్ దర్శకుల గత సినిమాల ఫలితాల గురించి ఆలోచించకుండా, అభిమానులు వారిస్తున్నా వినకుండా పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్లతో సినిమాలు చేసి మంచి ఫలితాలు అందుకోవడమూ తెలిసిందే.
ఐతే ఇప్పుడు కొరటాల శివ సినిమా విషయంలో తారక్ వ్యవహరిస్తున్న తీరు కరెక్టా కాదా అనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. ‘ఆర్ఆర్ఆర్’తో కెరీర్ పీక్స్‌ను అందుకున్న తారక్.. ఈ సినిమాకు సంబంధించి తన పనిని ఏడాది కిందటే పూర్తి చేసినా ఇప్పటిదాకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై కూడా ఆరు నెలలు దాటిపోయినా అతను ఖాళీగానే ఉన్నాడు.
‘ఆచార్య’ లాంటి సినిమా తీసి పాతాళానికి పడిపోయిన కొరటాల.. తారక్‌తో చేయాల్సిన సినిమాకు ఎంతకీ స్క్రిప్ట్ లాక్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ‘ఆచార్య’ తాలూకు ట్రామా ఆయన్ని వెంటాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి టైంలో తారక్ ఆయనతో సినిమా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం అభిమానుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. సినిమా అనుకున్న సమయానికి మొదలై ముందుకు వెళ్లిపోయి ఉంటే వేరే సంగతి. కానీ ఎంతకీ స్క్రిప్టు లాక్ కావట్లేదు. ఇటు చూస్తే తారక్ విలువైన సమయం వృథా అయిపోతోంది.
మొహమాటానికి పోయి, ఇచ్చిన మాట గురించి ఆలోచించి కొరటాల సినిమాకే కమిటై ఉండడం వల్ల తన కెరీర్‌కు తారక్ నష్టం చేసుకుంటున్నాడని, ఈ సినిమా కనుక అటు ఇటు అయితే జరిగే నష్టం ఇంకా పెద్దదిగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో తారక్ చేస్తున్నది కరెక్టేనా అన్న ప్రశ్నలను అభిమానులు సంధిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా విషయంలో రామ్ చరణ్ కఠినంగా వ్యవహరించినట్లే, కొరటాల సినిమా స్క్రిప్టు సంతృప్తినివ్వని పక్షంలో తారక్ మొహమాటాలు పక్కన పెడితే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
This post was last modified on October 12, 2022 9:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…