ఒకవేళ కాలం వెనక్కి తిరిగి మిమ్మల్ని ఏదన్నా కోరుకోమంటే మీకేం కావాలి అని ప్రశ్నించాడు కమెడియన్ ఆలి. ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒకప్పటి విజయవాహినీ స్టూడియోస్ తరహా ఎన్విరాన్మెంట్ కావాలంటూ చెప్పారు. అప్పట్లో పొద్దున్నే కార్ రాకపోతే.. మాయాబజార్ వంటి సినిమాలో నటించిన సావిత్రి తన అసిస్టెంట్ సైకిల్ వెనకెక్కి స్టూడియోకు వచ్చేసేవారని, ఇప్పుడు ఆ కమిట్మెంట్ ఏ నటీనటుల్లోనూ కనిపించట్లేదని అల్లూ అరవింద్ వాపోయారు. మరి స్టూడియో సిస్టమ్ ను సినిమాల్లో తిరిగి ప్రవేశ పెట్టడం కుదురుతుందా?
నిజానికి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్.. అలాగే వారికంటే ముందు పెద్ద స్టార్లు అయిపోయిన ఎస్వీరంగారావు వంటి వారు కూడా స్టూడియోల దగ్గర కాంట్రాక్ట్ లో ఉండేవారు. నెల జీతానికి పనిచేసేవారు. అందుకే అలాంటి కమిట్మెంట్ చూపించేవారు. ఇప్పుడంతా రోజువారీ రెమ్యూనరేషన్లకు చిన్న నటులు.. భారీ ఎమౌంట్లకు పెద్ద నటులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడొస్తే అప్పుడే షూటింగ్. వీళ్లు ఎవర్ని పెట్టుకోమంటే వాళ్లకే ఆఫర్లు. అందుకే ఇప్పుడున్న నటీనటులతో అలాంటి స్టూడియో సిస్టమ్స్ అన్నీ కష్టమే. అలాంటి స్టూడియో ఎవరన్నా కట్టినా కూడా ఎవ్వరూ అలా ఒక స్టూడియో దగ్గరే పనిచేయడానికి ఇష్టపడరు కూడాను. స్టూడియో ఓనర్ల పిల్లలే రకరకాలు ప్రొడ్యూసర్ల దగ్గర పనిచేస్తూ కోట్లను పోగేసుకుంటుంటే.. ఇతరులు ఎందుకు అలా జాబ్ చేస్తారు? అంతే కాదు.. ఒకప్పుడంటే కెమెరా చాలా పెద్దది అలాగే బాగా ఖరీదైనది. కాబట్టి ఒక స్టూడియో ఫ్లోర్లోనే సెటప్స్ చేసి అక్కడే కథంతా నడిపించేవారు. ఇప్పుడు పాకెట్లో పట్టే కెమెరాతో 6K క్వాలిటీ వీడియోలు తీసేయొచ్చు. కాబట్టి అందరూ స్టూడియోకే రావాలి అనే అవసరం కూడా పోయింది.
ఇకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విచిత్రం ఏంటంటే.. యునిట్ సభ్యులందరికీ ఏ కార్పొరేట్ కంపెనీ కూడా పెట్టనట్లు రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ పెడతారు. ఇది నిజానికి స్టూడియోలు సినిమాలను నిర్మిస్తున్నప్పటి పద్దతి. పొద్దున్నే పాపం నటీనటులు టెక్నీషియన్లు ఇతర వర్కర్లు పాపం వంట చేసుకుని రావాలంటే కష్టం కాబట్టి, ఆ సిస్టం పెట్టారు. కాని ఇప్పుడు 9 గంటలకు సెట్టుకొచ్చి, 5 గంటలకు పేకప్ చెప్పేసే బ్యాచ్ లు కూడా ఇదే సిస్టంను ఫాలో అవుతున్నాయ్. ఆ విధంగా కొన్ని స్టూడియో సిస్టమ్స్ ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు.
కాలంతోపాటు కొన్ని మార్పులు వచ్చేస్తాయ్ అనుకుని అల్లు అరవింద్ స్టూడియో సిస్టమ్ గురించి ఆలోచించకపోతేనే మంచిది. ఇక యాక్టర్లు టైముకి రావట్లేదంటే మాత్రం.. డిసిప్లీనరీ యాక్షన్లు గట్టిగా తీసుకుంటే సరిపోతుంది.
This post was last modified on October 12, 2022 6:45 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…