వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ బ్యూటీ ఓరు అడార్ లవ్ అనే మలయాళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో విమర్శలను సైతం మూటగట్టుకుంది. కానీ ఈ మూవీలోని కన్ను గీటిన సీన్ తో ప్రియా వారియర్ కుర్రకారు గుండెల్ని పిండేసి ఓవర్ నైట్ స్టార్ అయింది.
ఆ ఒక్క సీన్ తోనే ప్రియా వారియర్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఇండియా వైడ్‌గా మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ఆమెకు సౌత్ లో ఆఫర్లు వెల్లువెత్తాయి. టాలీవుడ్ లోనూ ఆమె రెండు చిత్రాలు చేసింది. అందులో నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ ఒకటైతే.. మరొకటి యంగ్ హీరో తేజ సజ్జ చేసిన ఇష్క్.
ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఇక ఇతర భాషల్లోనూ ప్రియా వారియర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడా ఈ అందాల భామను సక్సెస్ వరించలేదు. ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయి. దీంతో ఈ సింగిల్ నైట్ సెన్సేషన్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.
తరచూ మతి పోగొట్టే ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య ఏకంగా ఏడు మిలియన్లు దాటేసింది. ఈ విషయంలో స్టార్ హీరోయిన్లకు సైతం ప్రియా వారియర్ గట్టి పోటీ ఇస్తోంది. అంటే ఎంతలా ఆమె నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా క్లీవేజ్ షోకే మొగ్గు చూపే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చీరలో తన అందాలతో కనికట్టు చేసింది.
ఎప్పుడు మోడ్రన్ దుస్తుల్లోనే దర్శనమిచ్చే ప్రియా వారియర్ ఈసారి మాత్రం పింక్ అండ్ బ్లూ కలర్ పట్టు చీరను కట్టుకొని, మెడలో సింపుల్ చోకర్, కొప్పులోన మల్లెపూలు పెట్టుకుని అందంగా ముస్తాబై చిరునవ్వులు చిందిస్తూ కుర్ర కారు గుండెల్ని మరోసారి గట్టిగా పిండేసే ప్రయత్నం చేసింది. ప్రియా వారియర్ తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ట్రెడిషనల్ లుక్ లో వింక్ బ్యూటీ ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె అందాలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చీరలో దేవకన్యలా ఉన్నావు.. చూపు తిప్పుకోలేకపోతున్నామంటూ కామెంట్లు, మరోవైపు లైకుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆకట్టుకునే అందం ఉన్న ఆఫర్లు లేకపోవడం ఒక్కటే ఆమెకు లోటుగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అమ్మడు కెరీర్ పరంగా ఎప్పుడు జోరందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 12, 2022 1:43 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…