గత వారం దసరా పండక్కు వచ్చిన మూడింట్లో కలెక్షన్ల పరంగా గాడ్ ఫాదర్ దే ఆధిపత్యం కావడంతో మెగాస్టారే విజేతగా నిలిచారు. బ్రేక్ ఈవెన్ లెక్కలో హిట్టా కాదాని తేలడానికి ఇంకో పది రోజులు పట్టేలా ఉంది.
ఈలోగా మూవీ లవర్స్ కన్ను కొత్త శుక్రవారం మీద పడింది. ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అయితే దేనికీ అంచనాలు లేకపోవడమే ఇబ్బంది కలిగించే విషయం. ప్రమోషన్లు కూడా గట్టిగా చేసుకోలేని బ్యానర్లు కావడంతో సోషల్ మీడియా సహాయంతో అంతో ఇంతో అంచనాలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి వైపు ఓ లుక్ వేద్దాం
గజిని మొహమ్మద్ లా హిట్టు కోసం దండయాత్ర చేస్తూనే ఉన్న ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’గా వస్తున్నాడు. ట్రైలర్లు గట్రా చూస్తుంటే టైంపాస్ ఎంటర్ టైనర్ లా తోస్తోంది కానీ జనం ఏ మేరకు థియేటర్లకు వస్తారో చూడాలి.
ఎప్పటి నుంచో విడుదల వాయిదా ఉన్న ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ని ఇదే రోజు దించుతున్నారు. కెజిఎఫ్ క్రేజ్ ని ఇంకా వాడుకోవాలని చూస్తూ యష్ నటించిన ఓ పాత సినిమాను ‘రారాజు’ పేరుతో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. చాలాసార్లు పోస్ట్ పోన్ అయిన గీత, నావెంట పడుతున్న చిన్నవాడెవరమ్మా, నిన్నే పెళ్లాడతా, రుద్రనేత్రి, నీతో అన్నీ 14నే తాడోపేడో తేల్చుకుంటాయంటున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే కన్నడలో సంచలన విజయం నమోదు చేసుకున్న ‘కాంతారా’ మీద చెప్పుకోదగ్గ బజ్ అయితే ఉంది. ఇది ఒక రోజు ఆలస్యంగా 15న రానుంది. అయితే ఇందులో నేటివిటీ, బ్యాక్ డ్రాప్ మన జనానికి ఎంత మేరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి.
నిర్మాతలు మాత్రం కెజిఎఫ్, 777 ఛార్లీ లాగా దీనికి అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో నిర్మాతలున్నారు. తెలుగులో గీతా సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటంతో స్క్రీన్లు బాగానే దొరకనున్నాయి. గాడ్ ఫాదర్ బాగా నెమ్మదించడం, ఘోస్ట్ వాష్ అవుట్, స్వాతిముత్యం సోసోగా వెళ్లడం వీటిని పై సినిమాలు ఎంతమేరకు వాడుకుంటాయో చూడాలి
This post was last modified on October 12, 2022 12:21 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…