ఇంకా మూడు నెలలు ఉండగానే 2023 సంక్రాంతి బాక్సాఫీస్ యమా హాట్ గా మారిపోతోంది. చిరంజీవి వాల్తేర్ వీరయ్య, ప్రభాస్ ఆది పురుష్, విజయ్ వారసుడు ఇప్పటిదాకా ఆ సీజన్ ను కన్ఫర్మ్ చేసుకున్న సినిమాలు. బాలయ్య 107 అనే ప్రచారం జరిగింది కానీ అది డిసెంబర్ మూడో వారంలో రావడం ఖాయమే. దీపావళికి ప్రకటన ఇవ్వబోతున్నారు. ఇవి చాలవన్నట్టు అజిత్ తునివు(తెలుగు టైటిల్ ఇంకా పెట్టలేదు) ని సైతం పొంగల్ బరిలో దింపాలని నిర్మాత బోనీ కపూర్ నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై అప్ డేట్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఈ వారం నుంచే పోస్ట్ ప్రొడక్షన్ కు తీసుకెళ్లబోతున్నారు
అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది కానీ ఒకవేళ ఫిక్స్ అయితే మాత్రం థియేటర్లు బాగా టైట్ అయిపోతాయి. తెలుగులో అజిత్, విజయ్ ల మార్కెట్ పరిమితమే అయినప్పటికీ ఒకవేళ హక్కులు ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్ సొంతం చేసుకుంటే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా ఏర్పడే ఇబ్బంది అందరికీ చిక్కులను తెస్తుంది. అసలు ఆదిపురుష్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేయడానికి ఇందరు రెడీ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి దాని టీజర్ వచ్చాకే అందరికీ ధైర్యం వచ్చినట్టు ఉంది. ఒకవేళ బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ రెస్పాన్స్ వచ్చి ఉంటే కథ ఇంకోలా ఉండేదని వేరే చెప్పాలా.
ఈ తునివు కూడా ఓ విదేశీ చిత్రం స్ఫూర్తిగా తీసుకుని రూపొందిన రివెంజ్ డ్రామాగా ప్రచారం జరుగుతోంది కానీ ఇంకా క్లారిటీ లేదు. పూర్తిగా తెల్లబడిన బారుడు గెడ్డంతో అజిత్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. దర్శకుడు వినోత్ తో తనకిది హ్యాట్రిక్ కాంబినేషన్. వకీల్ సాబ్ కన్నా ముందు వచ్చిన పింక్ రీమేక్ నీర్కొండ పార్వైతో పాటు వలిమై తీసింది ఇతనే. ఒక డైరెక్టర్ నచ్చితే అతనికి వరసబెట్టి ఆఫర్లిచ్చే అజిత్ సిరుతై శివ తర్వాత ఈ వినోత్ కే ఇన్ని అవకాశాలిచ్చాడు. చూస్తుంటే సంక్రాంతి కోడిపుంజుల మధ్య యుద్ధం మాములుగా ఉండేలా కనిపించడం లేదు. ఇంకెవరెవరు వస్తారో
This post was last modified on October 11, 2022 10:58 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…