అక్కినేని నాగచైతన్యతో వివాహ బంధానికి సమంత తెరదించి అధికారికంగానే ఏడాది దాటిపోయింది. పోయినేడాది ఇదే టైంలో సామ్-చైతూ ఉమ్మడిగా విడాకుల ప్రకటన చేశారు. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. వీరి విడాకుల విషయం బయటికి వచ్చిన కొన్ని నెలలకే చైతూ.. వేరే హీరోయిన్ ఒకరితో డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. సమంత గురించి మాత్రం ఇప్పటిదాకా అలాంటి ఊహాగానాలేమీ రాలేదు.
ఐతే ఉన్నట్లుండి ఇప్పుడు సమంత కొత్త తోడు వెతుక్కుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు ఆమె తాజాగా ట్విట్టర్లో పెట్టిన పోస్టే కారణం. కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత.. ఈ రోజు ఒక ఆసక్తికర పోస్టు పెట్టింది. మీరంతా ఈ విషయం కూడా వినాలనుకుంటుంటే.. మనం ఎప్పటికీ ఒంటరిగా నడవం అన్న క్యాప్షన్‌తో ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది.
టీషర్ట్ మీద యు విల్ నెవర్ వాక్ అలోన్ అనే రాసి ఉంది. తన ముఖం కూడా సరిగా కనిపించని ఈ ఫొటోలో ఆ క్యాప్షన్ ఉన్న టీషర్టే హైలైట్ అయ్యేలా చూసుకుంది సామ్. దీని ద్వారా ఆమె ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకుంటోందన్నది స్పష్టం. మనం ఎప్పుడూ ఒంటరిగా నడవం అని చెబుతోందంటే.. తనకు తోడుగా ఇంకొకరు నడవబోతున్నారని, లేదా నడుస్తున్నారనే సంకేతాలు ఇస్తున్నట్లే. బహుశా తన వ్యక్తిగత జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చారనే విషయాన్ని సమంత ఇలా చెప్పకనే చెబుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐతే నిజంగా అలాంటి మార్పు ఏమైనా చోటు చేసుకుందా లేక ఇంతమంది అభిమానం చూపిస్తుండగా తాను ఒంటరిని కాదని చెప్పే ప్రయత్నం ఆమె చేసిందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. నిజంగా సమంత జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చి ఉంటే ఆ విషయం బయటపడడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
This post was last modified on October 11, 2022 10:48 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…