ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఈ కార్యక్రమం రెండో సీజన్లో భాగంగా అక్టోబర్ 14న తొలి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రారంభంకానున్న.. మొదటి ఎపిసోడ్ ప్రోమో విడదల అయ్యింది. ఇందులో బాలకృష్ణ సంధించిన ప్రశ్నలకు చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఇది భారీ రేంజ్‌లో అదర గొడుతోంది. సంచలనం సృష్టిస్తోంది.
చంద్రబాబును బాలకృష్ణ అద్భుత ఇంట్రడక్షన్ ఇచ్చి షోలోకి ఆహ్వానించారు. బాలకృష్ణ తన ఎనర్జీతో ప్రేక్షకులను ఊర్రూతలూ గించారు. ఈ సందర్భంగా ‘మొదటి ఎపిసోడ్కు నా బంధువును పిలుద్దామనుకున్నా.. కానీ అందరి బంధువు అయితే బాగుం టుందని.. మీకు బాబు.. నాకు బావ.. చంద్రబాబు నాయుడును ఆహ్వానించా. భారతదేశంలోని దిగ్గజ రాజకీయ నాయకులలో ఒకరైన చంద్రబాబుకు స్వాగతం’ అంటూ బాలకృష్ణ ఆహ్వానం పలికారు.
తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని.. అందులో మొదటిది భార్య వసుంధర, పిల్లలు అని.. రెండోది క్రిత సంవత్సరం స్టార్ట్ అయిందని.. దాంతో డీప్గా కనెక్ట్ అయిపోయా అని అన్స్టాపబుల్ను ఉద్దేశించి అన్నారు బాలయ్య. దానికి బాబు స్పందిస్తూ.. ‘ఈ బ్రేకింగ్ న్యూస్ వెంటనే వసుంధరకి చెప్పాలి’ అంటూ చమత్కరించారు.
ఆ తర్వాత ‘మీ జీవితంలో చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి’ అని బాలయ్య ప్రశ్నించగా.. ‘నీకంటే ఎక్కువే చేశా. మీరు సినిమాల్లో చేస్తే.. నేను స్టూడెంట్గా చేశా’ అని బదులిచ్చారు చంద్రబాబు. దీనికి బాలయ్య స్పందించి ‘మీరు ఎంతైనా ముందుచూపు కలవారు. రాళ్లు రప్పలు ఉన్న హైదరాబాద్ను అద్భుతంగా మార్చారు. అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి.. గ్రాఫిక్స్ అనలేర’ని రాజకీయాలను ఉద్దేశించి అన్నారు.
అనంతరం ‘మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు ‘ దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో కలిసి బాగా తిరిగాన’ని బదులిచ్చారు బాబు. తర్వాత ‘మీరు తీసుకున్న పెద్ద నిర్ణయం ఏంట’ని ప్రశ్నించారు బాలయ్య. దానికి 1995లో జరిగిన విషయాలపై బాబు మాట్లాడారు. ‘ఆ విషయంలో కాళ్లు పట్టుకునే వరకు వెళ్లా’ అని బదులిచ్చారు. ఆ తర్వాత ‘మా చెల్లిని ఏమని పిలుస్తారు బావా’ అంటే.. ‘పువ్వు’ అని సమాధానమిచ్చారు బాబు.
తర్వాత లోకేశ్ ఎంట్రీ ఇచ్చి షోను రక్తికట్టించారు. ‘మీ నాన్నను వేరే గెటప్లో చూశావా’ అని మామ అడిగిన ప్రశ్నకు ‘ఆయన ఎప్పుడూ ఇదే గెటప్లో ఉంటారు’ అని చెప్పారు లోకేశ్. అనంతరం కొద్దిసేపు లోకేశ్ హోస్ట్గా వ్యవహరించి మామ, తండ్రిపై ప్రశ్నల వర్షం కురింపించారు. ఇక ఆ తర్వాత మొత్తం నందమూరి వారి ప్రశ్నలు, నారా వారి సమాధానలు నవ్వులు పూయించాయి.
This post was last modified on October 11, 2022 8:40 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…