ఒకప్పుడు తమిళంలో ఏదైనా హిట్ సినిమా రావడం ఆలస్యం దాని రీమేక్ హక్కుల కోసం మన నిర్మాతలు చెన్నై వెళ్ళిపోయి డీల్ సెట్ చేసుకుని వచ్చేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. గత నాలుగైదేళ్లలో మలయాళం కంటెంట్ లో నాణ్యత విపరీతంగా పెరిగిపోయింది. కమర్షియల్ టచ్ ఇస్తూనే క్లాసు మాసు అందరినీ మెప్పించే అద్భుతమైన సబ్జెక్టులతో సదరు దర్శక నిర్మాతలు చేస్తున్న మేజిక్ అంతా ఇంతా కాదు. మెగా బ్రదర్స్ రీసెంట్ హిట్స్ భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ రెండూ అక్కడి నుంచి తెచ్చుకున్న కథలని మర్చిపోకూడదు. బుట్టబొమ్మ లాంటి చిన్న చిత్రం సైతం కేరళలో కొన్న సరుకే.
తాజాగా మమ్ముట్టి నటించిన రోర్సాచ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిసం బషీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. నిజానికి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం ఓ పేరు మోసిన ఓటిటి మల్లువుడ్ లో అప్పటిదాకా ఎవరూ ఆఫర్ చేయని భారీ మొత్తాన్ని ఇవ్వజూస్తే చిత్ర బృందం నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఇప్పుడు దానికి మించిన గొప్ప ఫలితాన్ని బాక్సాఫీస్ సాక్షిగా ఎంజాయ్ చేస్తోంది. హైదరాబాద్ లోనూ పలు మల్టీప్లెక్సుల్లో మంచి కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న రోర్సాచ్ ని సబ్ టైటిల్స్ సహాయంతో మూవీ లవర్స్ చూస్తున్నారు.
కథ పరంగా ఇదో డిఫరెంట్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివెంజ్ డ్రామా. అటవీ నేపథ్యంలో ఉంటుంది. ఓ ఎన్ఆర్ఐ(మమ్ముట్టి) తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. యాక్సిడెంట్ జరిగాక స్పృహలోకి వచ్చి చూస్తే మాయమయ్యిందని చెబుతాడు. ఆమె దొరికే వరకు ఎక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేస్తాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అవేంటో తెర మీదే చూడాలి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఊహించని పాయింట్ తో ఈ రోర్సాచ్ ని తీర్చిదిద్దిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి ఇది ఏ అగ్ర హీరో చేతికి వెళ్తుందో చూడాలి
This post was last modified on October 11, 2022 2:27 pm
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…
'పద్మ శ్రీ' వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు…
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు…
2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల…