Movie News

అంత ఎనర్జీ పెట్టేస్తున్నావేంటి పవన్?

మొన్నటివరకు పవర్ స్టార్ పవణ్‌ కళ్యాణ్‌ పనితీరు ఎలా ఉండేదంటే.. టైముకి కాస్త లేటుగా సెట్టుకు వచ్చేసి, తన వర్క్ అంతా త్వరగా ముగించుకుని, వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయేవారు. పొలిటికల్ గా జనసేనతో బిజీగా ఉన్నారు కాబట్టి, అంతకంటే ఎక్కువ టైమ్ కేటాయించడం కష్టమయ్యేదంట. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలు ఈ తరహాలోనే రూపొందాయ్. అయితే ఇప్పుడు మాత్రం సడన్ గా తన తదుపరి సినిమా కోసం పవన్ విపరీతంగా టైమ్ ఇచ్చేస్తుంటే.. అసలు ఏం జరుగుతోంది అనే సందేహం రాకమానదు.

అసలు పాలిటిక్స్ లో లేనప్పుడు కూడా, పవన్ కళ్యాణ్‌ గబ్బర్ సింగ్ వంటి సినిమాలకు ఫారిన్ సాంగ్స్ కు డైరక్టర్ ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయి, తనే రెండ్రోజుల్లో సాంగ్ పూర్తిచేసుకుని ఇండియా తిరిగొచ్చేవాడు. ఇప్పుడేమో అసలు టైమ్ అనేది ఇవ్వట్లేదు. కాని క్రిష్‌ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం పవన్ ఎక్కడలేనంతా సమయాన్ని అర్పిస్తున్నాడు. మొన్నటికి మొన్న రీడింగ్ సెషన్ కు విచ్చేశాడు, ఇప్పుడేమో ఫైటింగ్స్ ప్రాక్టీస్ కు వస్తున్నాడు. తరువాత డ్యాన్స్ క్లాసెస్ కూడా ఉన్నాయట. అసలు తెలుగు హీరోలు రీడింగ్ సెషన్ కు రావడమా? సెట్టుకొచ్చాక డైలాగ్స్ మార్చండి, పేకప్, అంటూ నిర్మాతలను బెంబేలెత్తించే స్టార్స్ ఉన్న ఈ రోజుల్లో.. పవన్ ఇంత ఎనర్జీ పెట్టేసి ఎందుకు పనిచేస్తున్నాడు అనే సందేహం రాకమానదు.

నిజానికి షెడ్యూల్ గ్యాప్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రషెస్ చూసిన పవన్ బాగా ఫిదా అయిపోయాడట. అసలే తనకిది తొలి పౌరాణికం. అయినాసరే క్రిష్ ఉన్నాడు కాబట్టి గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. దానికితోడు అవుట్పుట్ బాగా వచ్చింది కాబట్టి, ఇంకాస్త కష్టపడితే నిర్మాతకు భారీగా ప్రాఫిట్స్ వస్తాయని పవన్ ఆశిస్తున్నాడట. అసలు కష్టాల్లో ఉన్న ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకే పవన్ ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి, ఆ సహాయం ఏదో కాస్త గాట్టిగా చేయాలని ఫిక్సయినట్లున్నాడులే.

This post was last modified on October 11, 2022 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

14 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

15 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

15 hours ago