ఏ దర్శకుడైనా తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాతను అంత సులువుగా మరచిపోలేడు. ఏ గుర్తింపు లేని సమయంలో ఆ ఛాన్స్ ఇచ్చిన నిర్మాతను.. తాను పెద్ద స్థాయికి వెళ్లాక కూడా మరిచిపోలేడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్‌ను రచయితగా ప్రోత్సహించింది, దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది సీనియర్ నిర్మాత స్రవంతి రవికిషోర్. ఆయన బేనర్లో రచయితగా నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్.. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు.
అప్పట్లో సూపర్ హిట్టయిన ఈ చిత్రం విడుదలై అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్‌లో చిత్ర బృందంతో పాటు మీడియాకు ప్రత్యేక ప్రదర్శన వేశారు. అనంతరం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో దర్శకుడిగా తనకు జన్మనిచ్చిన స్రవంతి రవికిషోర్ గురించి గొప్పగా మాట్లాడాడు త్రివిక్రమ్. ఒక నిర్మాతకు ఇలాంటి ఎలివేషన్ ఇంకెవ్వరూ ఇచ్చి ఉండరు అన్న తరహాలో త్రివిక్రమ్ ప్రసంగం ఎలా సాగిందంటే..
మద్రాసులో ‘నీరం’ చూసి అందులో సన్నివేశాలను నా ఇష్టం వచ్చినట్లు ఎలా మార్చేయాలో చెబుతుంటే విన్న రవికిషోర్ గారు… ‘స్వయం వరం’ రాసిన తర్వాత నన్ను ఎవరూ పిలవకపోతే నేను భీమవరం వెళ్లి క్రికెట్ ఆడుకుంటుంటే మా ఇంటి పక్కన ఎస్‌టీడీ బూత్ నంబర్ కనుక్కుని నాకు ఫోన్ చేసిన రవికిషోర్ గారు… ‘నువ్వు నాకు నచ్చావ్’ కథను మీరు అనుకున్న హీరోకి కాకుండా పెద్ద హీరోకి చెబుతానని వాదిస్తే ‘నీ ఇష్టం వచ్చినట్టు చావు’ అని ప్రోత్సహించిన రవికిషోర్ గారు… రాత్రిపూట స్క్రిప్ట్ చదివి నేను రాసిన డైలాగ్ నచ్చితే ఫోన్ చేసి ఏడ్చిన రవికిషోర్ గారు… నేను పంజాగుట్టలో ఉన్నప్పుడు మా రూమ్ దగ్గరకు వచ్చి కింద నుంచి హారన్ కొట్టి పిలిచే రవికిషోర్ గారు… ఆయనకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? రసికుడు కానివాడికి కవిత్వం నివేదించే దరిద్రం నా నుదుటి మీద రాయొద్దని కాళిదాసు చెప్పాడు. నేను రాసిన మాటలు వినే రసికుడిని నాకు ప్రదర్శించినందుకు దేవుడికి నేను ఎన్నిసార్లు కృతఙ్ఞతలు చెప్పాలి అంటూ రవికిషోర్‌ను తనదైన శైలిలో గౌరవించుకున్నాడు త్రివిక్రమ్.
This post was last modified on %s = human-readable time difference 12:48 pm
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…