గరుడవేగ సినిమాతో తనపై భారీగా అంచనాలు పెంచాడు యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అంతకుముందే అతను ఎల్బీడబ్ల్యూ, చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి డీసెంట్ సినిమాలు అందించినా గరుడవేగ చూశాక తన అసలు క్యాలిబర్ ఏంటో తెలిసింది. ఇతడిలో ఇంత కంటెంట్ ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. తన టాలెంట్ గమనించి అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరో అవకాశం ఇచ్చాడు. వీరి కలయికలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. కానీ సినిమాలో స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప పెద్దగా విషయం లేకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు.
గరుడవేగను ఉత్కంఠభరిత యాక్షణ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దిన ప్రవీణ్.. ది ఘోస్ట్‌లో అదే జానర్‌ను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కథ, కథనం ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేదు ఈ చిత్రంలో. సినిమా అంతా గన్నుల మోత, యాక్షన్ సీన్ల హంగామా తప్పితే విషయం లేకపోయింది.
ఐతే ది ఘోస్ట్‌తో అంత పెద్ద దెబ్బ తిన్నాక కూడా ప్రవీణ్ సత్తారు రూట్ మార్చట్లేదు. మళ్లీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లోనే సినిమా తీయబోతున్నాడు. వరుణ్‌తేజ్‌తో అతడి కొత్త చిత్రం షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ఈ సందర్భంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా హైలైట్ అయింది గన్నులే. రకరకాల గన్నులు చూపించి వాటిని వరుణ్ తేజ్ టెస్ట్ చేస్తున్నట్లు చూపించారు.
ఇది చూశాక ది ఘోస్ట్ సినిమా అంతటా అన్నేసి గన్నులు, వాటి మోత చూపించి ఫెయిలైన ప్రవీణ్.. తిరిగి తన కొత్త చిత్రంలోనూ ఇవే చూపించబోతున్నాడా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు జనాలు. ఐతే ది ఘోస్ట్ విడుదలకు ముందే ఈ సినిమా కథ లాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేం చేసేది లేదు. ఐతే ఘోస్ట్‌లో ఏం మిస్సయిందో సమీక్షించుకుని ఈసారి జాగ్రత్తగా సినిమా తీస్తాడని వరుణ్ తేజ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
This post was last modified on October 10, 2022 10:55 pm
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…