Movie News

మళ్లీ అదరగొట్టిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు బుల్లితెరపై చెలరేగిపోతున్నాడు. అతడి చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ మరోసారి టీవీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెకండ్ టెలికాస్ట్‌లో ఈ చిత్రానికి 17.4 టీఆర్పీ రావడం విశేషం. గత వీకెండ్లో ‘సరిలేరు..’ను రెండోసారి టెలికాస్ట్ చేసింది జెమిని టీవీ. ఈసారి కూడా ఈ చిత్రాన్ని టీవీ ప్రేక్షకులు విరగబడి చూశారని టీఆర్పీ రేటింగ్‌ను బట్టి స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి ఇంతకుముందే మార్చి చివరి వారంలో జెమినిలో తొలిసారిగా ప్రిమియర్‌గా వేయగా.. అప్పుడు రికార్డు స్థాయిలో 23.4 రేటింగ్ తెచ్చుకుంది. అది టాలీవుడ్ చరిత్రలోనే టాప్-3 రేటింగ్ కావడం విశేషం. దీని కంటే ముందు మహేష్ చేసిన ‘మహర్షి’ థియేటర్లలో బాగా ఆడినా.. టీవీలో డిజాస్టర్ అయింది. మహేష్ కెరీర్లోనే అత్యల్పంగా.. 10 లోపు రేటింగ్ తెచ్చుకుంది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ను తొలిసారి ప్రసారం చేసినపుడు ఏమాత్రం రేటింగ్ వస్తుందో అని సందేహించారు.

ఐతే తొలి ప్రిమియర్లో ఈ చిత్రం ‘బాహుబలి’ని మించి రేటింగ్ తెచ్చుకుంది. అక్కినేని నాగార్జున సిినిమా ‘శ్రీరామదాసు’ 24 రేటింగ్‌తో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ‘టెంపర్’ 23.5 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. మార్చి ప్రిమియర్‌తో ‘సరిలేరు..’ మూడో స్థానాన్ని చేరుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కొత్త సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లోకి వస్తుండటంతో అక్కడ చాలామంది చూస్తున్నారు. ఆ తర్వాత టీవీల్లోకి వస్తుండటంతో రేటింగ్స్ బాగా పడిపోతున్నాయి.

ఐతే కరోనా పుణ్యమా అని థియేటర్లలో కొత్త సినిమాలు లేకపోవడం, జనాలు ఎక్కువగా ఇంటిపట్టున ఉంటుండటంతో ఇప్పుడు కొత్త చిత్రాలకు మంచి రేటింగ్ వస్తోంది. ఈ క్రమంలోనే ‘సరిలేరు..’ రికార్డు స్థాయి రేటింగ్ తెచ్చుకుంది. రెండో టెలికాస్ట్‌లో కూడా 17.4 రేటింగ్ రావడమంటే మాటలు కాదు. ఇది కూడా ఒక రికార్డు అయితే ఆశ్చర్యం లేదు.

This post was last modified on July 9, 2020 1:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago