గత నెల విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా గురించి బాలీవుడ్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సినిమాలో విషయం వీకే అయినప్పటికీ పీఆర్ మాయాజాలంతో ఈ సినిమాకు బాగానే హైప్ తీసుకురాగలిగింది కరణ్ జోహార్ టీం. బాలీవుడ్ క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లందరూ ఈ సినిమాను ఆహా ఓహో అంటూ కొనియాడారు. వసూళ్ల గురించి కూడా గొప్పగా చెప్పుకున్నారు. ఇది బ్లాక్‌బస్టర్ అన్నట్లే కలరింగ్ ఇచ్చారు.
కానీ బాలీవుడ్ సినిమాల వసూళ్లు బాగా పడిపోయిన పరిస్థితుల్లో బ్రహ్మాస్త్ర డివైడ్ టాక్‌ను తట్టుకుని బాగానే నిలబడింది. ఉన్నంతలో మంచి కలెక్షన్లే రాబట్టింది. చాలా రోజుల పాటు ఆ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగింది. కానీ పెట్టుబడి రాబడి కోణంలో చూస్తే మాత్రం బ్రహ్మాస్త్ర డిజాస్టర్ అనే చెప్పాలి. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన సందర్భంగా బయటికి వచ్చిన నంబర్స్ చూస్తే ఆ విషయాన్ని ఒప్పుకుని తీరాలి.
బ్రహ్మాస్త్ర ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ రూ.400 కోట్ల గ్రాస్, రూ190 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇండియా వరకు ఆ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా వచ్చాయి. ఐతే బ్రహ్మాస్త్ర బిజినెస్ రూ.600 కోట్లకు జరిగింది. రూ.300 కోట్ల షేర్ వస్తే తప్ప అది బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి. కానీ రికవరీ చూస్తే 65 శాతం లోపే ఉంది. 35 శాతం.. అంటే రూ.100 కోట్లకు పైగానే నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నమాట ఈ చిత్రం. ఒక్క తెలుగులో మినహాయిస్తే ఎక్కడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. నార్త్ మార్కెట్లో బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోయింది.
కాకపోతే ఈ సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మిన కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర-2ను బయ్యర్లకు కాస్త రీజనబుల్ రేట్లకే ఇవ్వొచ్చు. బ్రహ్మాస్త్రకు మంచి హైప్ వచ్చి మీడియాలో, సోషల్ మీడియాలో దాని గురించి బాగానే హడావుడి జరిగింది. దాన్నో బ్లాక్‌బస్టర్ మూవీలాగా ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి సెకండ్‌పార్ట్‌కు హైప్ బాగానే వస్తుంది. అలా అందరూ సేఫ్ జోన్లోకి రావడానికి ఛాన్సుంటుంది.
This post was last modified on October 10, 2022 7:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…