ఏదో పాత నవలలను కొనుక్కున్నాం. వాటిని కథలుగా తీసేస్తాం. మీరు చూద్దామనుకునే వెబ్ సిరీస్ లు ఇవే. ఇప్పుడు చాలామంది తెలుగు దర్శకుల మైండ్ సెట్ ఇదే. నెట్ ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ రేంజ్ కంటెంట్ కావాలి బాసూ అంటే.. వీళ్ళు చేసే అతి ఇలా ఉంటుంది. ఆ విధంగా చాలామంది డైరక్టర్లు తెలుగులో చాలా వెబ్ సిరీస్ మరియు వెబ్ ఫిలింస్ తీస్తే.. బడా ఓటిటి ప్లాట్ఫాంస్ ఇప్పుడు తెలుగువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. అయినాసరే మనోళ్లు ఆగట్లేదు.
రామారావు ఆన్ డ్యూటి సినిమాను ఒక అద్భుతమైన వెండితెర ఆవిష్కరణగా ప్రమోట్ చేసిన దర్శకుడు శరత్ మండవ గుర్తున్నాడా? ఆ సినిమాను ఒక పీడకలగా అందరూ మర్చిపోతున్న టైంలో మనోడు ఇప్పుడు ఒక మెరుపులాంటి న్యూస్ ను లీక్ చేశాడు. 70ల నుండి 80లలో బాగా ఫేమస్ అయిన మధుబాబు ‘షాడో’ నవల్స్ రైట్స్ ను కొనుక్కున్నాడట. వాటిని టాప్ డైరక్టర్స్ కు ఇచ్చేసి ఇప్పుడు వెబ్ సిరీస్ లు తీయిస్తాడట. కాని మనోడికి అర్ధంకాని విషయం ఏంటంటే.. ఆల్రెడీ ఆయన నవల్లలోని చాలా సీన్లను, సీక్వెన్సులనూ ఆల్రెడీ చాలామంది తెలుగు రైటర్లు, డైరక్టర్లు ఎత్తేశారు.
90లలో వచ్చిన అనేక సినిమాల్లో ఆయన నవల్స్ లోని సీన్స్ ఉన్నాయ్. చివరకు అతడు సినిమాలో సునీల్ చెప్పే చిన్నప్పటి స్మశానం ఫ్లాష్ బ్యాక్ కూడా మధుబాబు ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెబితే వాడేసుకున్నాడు త్రివిక్రమ్. కోదండరామి రెడ్డి, ముత్యాల సుబ్బయ్య, బి గోపాల్ వంటి దర్శకులు ఆయన నవల్లలోని చాలా సీన్లను ఉచితంగానే లేపేశారు. కాబట్టి ఇప్పుడు షాడో నవల్స్ తీస్తే.. అవి పాత సినిమాలను కాపీ కొట్టి మళ్ళీ తీసినట్లే ఉంటుంది కాని, కొత్తగా ఉండదు.
ఇకపోతే షాడో నవల్స్ లో ఉన్న లెవెల్ ఆఫ్ డిటైల్ కూడా కాస్త సింపుల్ గానే ఉంటుంది. ఇప్పటి తరానికి అది సరిపోదు. ఆ కథలను తీసుకుని వాటిపై చాలా వర్క్ చేస్తే కాని ఆడియన్స్ కు ఎక్కదు. మరి ఇవన్నీ ఆలోచించుకున్నాడా రామారావు ఆన్ డ్యూటి దర్శకుడు? లేదంటే పుష్ప సినిమాకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ పై బెటర్ సినిమా తీశానని ఫీలైనట్లు ఊరికే ఎక్కువ ఊహించేసుకుంటున్నాడా? చూద్దాం!!
This post was last modified on October 10, 2022 7:46 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…