అనతికాలంలోనే ఏకంగా ఇనస్టాగ్రామ్ లో సమంతకు ఉన్న ఫాలోయింగ్ ను బీట్ చేసేసి.. నేషనల్ క్రష్ గా ఎదిగేసింది రష్మిక మందన్నా. ఒక ప్రక్కన సమంత అండ్ కాజల్ చేసినన్ని సినిమాలు చేయకపోయినా కూడా, రష్మిక రేంజ్ మాత్రం అమాంతం పెరిగింది. కాని ఆ రేంజ్ అక్కడే చాలాకాలాం కొనసాగాలంటే మాత్రం అమ్మడికి హిట్టు సినిమాలతో పాటు అవార్డులూ రివార్డులూ కూడా చాలా ముఖ్యం. అలాంటి ఒక అవార్డ్ ఆమెను వరిస్తుందని అనుకుంటే, చివరకు రష్మిక డిజప్పాయింట్ అవ్వాల్సొచ్చింది.
గతేడాది చివర్లో రిలీజైన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అల్లు అర్జున్ కు నేషనల్ వైడ్ మార్కెట్ ఓపెన్ అయితే.. రష్మికకు కూడా బాలీవుడ్లో ఆఫర్లు కుప్పలు తెప్పలు వచ్చి పడుతున్నాయ్. అయితే ఆ సినిమాలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్రకు అమ్మడు ఫిలింఫేర్ బ్లాక్ లేడీ వరిస్తుందని చాలా ఆశించిందట. ఒకవేళ ఆమెకు ఫిలింఫేర్ అవార్డ్ వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా అది కెరియర్ కు చాలానే హెల్ప్ అయ్యేది.
అయితే ఫిలింఫేర్ మాత్రం లవ్ స్టోరి సినిమాలో కనబరచిన అత్యుత్తమ నటనకు సాయిపల్లవిని వరించింది. దాదాపు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సింగర్స్, బెస్ట్ సినిమాటోగ్రాఫీ అవార్డులను దక్కించుకున పుష్ప సినిమాకు, బెస్ట్ హీరోయిన్ ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఓ విధంగా చూస్తే ఇది రష్మికకు షాకే.
అసలు తనకు అవార్డు రాలేదనే విషయం ముందుగానే తెలియడంతో అమ్మడు ఏకంగా ఊళ్లో లేకుండా మాల్డీవ్స్ ట్రావెల్ ప్లాన్ చేసుకుందని అంటున్నారు. లేదంటే పుష్ప టీమ్ తో పాటు అమ్మడు కూడా బెంగుళూరు వెళ్ళాల్సి వచ్చేదిగా. మరో ప్రక్కన అమ్మడు బాలీవుడ్లో చేసిన తొలిసినిమా గుడ్ బాయ్ కూడా బాక్సాఫీస్ దగ్గర భారీగా తేలిపోయింది. ఇటు యాక్టింగ్ కు మార్కులు పడలేదు, అటు సినిమాకూ రేటింగులు రాలేదు. అది సంగతి.
This post was last modified on October 10, 2022 12:48 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…