మెగాస్టార్ చిరంజీవి తనే స్వయంగా స్పీచ్చులతో దంచి కొడుతుంటే.. అంతకంటే దారాళంగా మాట్టాడే వక్తలు ఆయన మీటింగుల్లో అవసరం లేదులే. అందుకే ఇప్పుడు గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్ రాకపోయినా, అలాగే సక్సెస్ మీట్ కు రామ్ చరణ్ రాకపోయినా కూడా అభిమానులు మాత్రం పెద్దగా ఫీలవ్వట్లేదు. కాని గాడ్ ఫాదర్ సినిమా చూసిన చాలామంది సినిమా లవ్వర్స్ మాత్రం.. సక్సెస్ మీట్లో దర్శకుడు పూరి జగన్ కనిపించుంటే బాగుండేదని చాలా కోరుకున్నారు. చివరకు ఆయన రాకపోయేసరికి డిజప్పాయింట్ అయ్యారు.
సినిమాలో చిన్న చిన్న క్యారక్టర్లు, అలాగే ఊరికే అలా కనిపించి వెళ్లిపోయిన వాళ్లను కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచిన మెగాస్టార్ చిరంజీవి టీమ్.. మరి దర్శకుడు పూరి జగన్ ను మర్చిపోయి ఉంటారా? డెఫెనెట్ గా మర్చిపోలేదు అంటున్నారు కొందరు సన్నిహితులు. అసలు ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఒక రూమర్ ఏంటంటే.. సక్సెస్ ఈవెంటుకు రావాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసినా కూడా పూరి జగన్ రెస్పాండ్ అవ్వలేదట. ఆల్రెడీ లైగర్ ఫ్లాప్ అయ్యిందని గోవాలో కూర్చుని తన తదుపరి సినిమా గురించి తర్జనభర్జన పడుతున్న పూరి, ఇప్పుడు మెగాస్టార్ ఈవెంటుకు వస్తే అనవసరంగా ట్రోలింగ్ కు గురయ్యే ఛాన్సుందని ఈ ఈవెంటును ఎవాయిడ్ చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా కూడా.. గాడ్ ఫాదర్ సినిమాలో తన మార్కు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పూరి జగన్ మాత్రం.. త్వరలోనే మాంచి యాక్టర్ గా కూడా కెరియర్ లాంచ్ చేసుకుంటే బాలీవుడ్లో అనురాగ్ కశ్యప్ తరహాలో విలన్ గా అయిన రోల్స్ చేసుకోవచ్చు. కాని ఆయన వీరాభిమానులు మాత్రం ఆల్రెడీ లైగర్ తో పోయిన పేరు ఎలాగైనా తిరిగి సంపాదించాలని.. తదుపరి ఒక పెద్ద హీరోతో ఆయన ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. చూద్దం పూరి జగన్ ఏం చేయనున్నారో మరి!
This post was last modified on October 10, 2022 12:32 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…