డార్లింగ్ ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మంచి స్వింగ్ మీదున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి ముందు నుంచి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దాన్ని పూర్తిగా ఖండించడం కానీ కొత్తది ప్రకటించడం కానీ చేయకపోవడంతో ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఇదే ఫిక్స్ అయ్యారు. ఒక పాత థియేటర్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో హారర్ కామెడీ జానర్ లో రూపొందిస్తున్నట్టు ఆల్రెడీ లీక్ ఉంది. చాలా తక్కువ కాల్ షీట్లతో వీలైనంత వేగంగా రెండు మూడు నెలల్లోనే టాకీ పార్ట్ పూర్తయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు వినికిడి.
హీరోయిన్లు ఇద్దరు ఉంటారని ప్రస్తుతానికి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అడిగితే వీళ్ళు నో చెప్పేంత బిజీగా లేరు, ప్రభాస్ సరసన నటించేందుకు కాదనేంత అమాయకురాళ్లు అసలే కాదు. సో నిజంగా ప్రపోజల్ వెళ్లుంటే మాత్రం కన్ఫర్మ్ అయినట్టే. విలన్ గా సంజయ్ దత్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాకపోతే ఆయన డేట్లు మరీ టైట్ గా ఉండటంతో ఫైనల్ అయ్యేది లేనిది తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోగా మిగిలిన వ్యవహారాలు చక్కదిద్దే పనిలో మారుతీ టీమ్ చాలా బిజీగా ఉన్నట్టు తెలిసింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న పక్కా కమర్షియల్ పెద్ద దెబ్బ కొట్టడంతో మారుతీ దీంతో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలే ప్యాన్ ఇండియా స్టార్ తో అవకాశం. ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ లైఫ్ లో రాదు. దీంతో కనక బ్లాక్ బస్టర్ కొడితే మళ్ళీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఎటొచ్చి సాహో, సలార్ లాగా వందల కోట్ల బడ్జెట్ ముడిపడిన మూవీ కాదు కాబట్టి కంటెంట్ తోనే బలంగా కొట్టాలి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం గట్టిగానే ఉంటాయట. దీని తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమా కూడా మారుతీకి రావడం లాంఛనమే. ఆల్రెడీ మెగాస్టారే పబ్లిక్ స్టేజి మీద చెప్పేశారు కాబట్టి డ్రాప్ అవ్వడం ఉండకపోవచ్చు
This post was last modified on October 10, 2022 9:55 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…