సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఆదివారం తన అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఉన్నట్లుండి తనకు కవలలు పుట్టినట్లు వెల్లడించింది. నయన్, ఆమె భర్త విఘ్నేష్ శివన్ తమ ఇద్దరు కొడుకుల కాళ్లను ముద్దాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నయనతారకు పెళ్లయి నాలుగు నెలలే అయింది. ఆమె గర్భం కూడా ధరించలేదు. ఈలోపే పిల్లలేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు.
ఐతే సెలబ్రెటీలు చాలామంది లాగే నయన్ కూడా సరోగసీ ద్వారా పిల్లల్ని కన్న విషయం జనాలకు అర్థం కావడానికి కొంచెం సమయం పట్టింది. ఇదిలా ఉండగా.. నయన్ కవలలకు తల్లి అయిన విషయం వెల్లడైన కాసేపటికే ఆమె నటించిన ఒక తెలుగు సినిమాలోని సన్నివేశం తాలూకు వీడియో సోషల్ మీడియాను ఊపేయడం మొదలైంది. ఆ సినిమా అదుర్స్ కావడం విశేషం.
ఈ సినిమాలో నయనతార ఇంట్రో సీన్లో స్విమ్మింగ్ పూల్ నుంచి ఆమె బయటికి వచ్చాక ఎన్టీఆర్ తన పుట్టు మచ్చల గురించి మాట్లాడతాడు. మచ్చ శాస్త్ర ప్రకారం మీకు కవలలు పుడతారు అని కూడా అంటాడు. దానికి నయన్ బాగా ఉడుక్కుంటుంది.
ఇప్పుడు నయన్‌కు నిజంగానే కవలలు పుట్టడంతో ఎన్టీఆర్ ఆనాడే చెప్పాడు ఈ విషయం అంటూ నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. అలాగే సినిమా చివర్లో నయన్ నిజంగానే మగ కవలలకు జన్మనివ్వగా ఇద్దరు బిడ్డల్ని బ్రహ్మానందం ఒడిలో పెట్టుకుని ఆడించే సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్‌ను కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ ఆ చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ను విజనరీగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. ఏ చిన్న అవకాశం దొరికినా చురుగ్గా స్పందిస్తూ మీమ్ ఫెస్టివల్ చేసే తెలుగు నెటిజన్లకు ఇలాంటి విషయాల్లో ఎలా చెలరేగిపోతారో తెలిసిందే.
This post was last modified on October 10, 2022 5:36 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…