మంచు విష్ణు హీరోగా ఈ నెల 21న విడుదల కాబోతున్న జిన్నా వాస్తవానికి ముందు అనుకున్న డేట్ అక్టోబర్ 5. దసరాని టార్గెట్ చేసుకుని బాక్సాఫీస్ బరిలో దిగాలనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఇతరత్రా కార్యక్రమాల వల్ల వాయిదా వేసుకోక తప్పలేదు. దాని స్థానంలో పండక్కు ట్రైలర్ తో సరిపెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే జిన్నా టీమ్ కి ఈ నిర్ణయం చాలా రకాలుగా కలిసి వచ్చింది. మొన్న బుధవారం మూడు సినిమాలు పోటీ పడినప్పటికీ తక్కువ అంచనాలున్న గాడ్ ఫాదర్ సంచలన విజయం అందుకుంది. ట్రైలర్ పాజిటివ్ గా అనిపించిన ది ఘోస్ట్ దారుణంగా దెబ్బతింది.
రిలీజ్ కు ముందే ప్రీమియర్లతో మంచి టాక్ తెచ్చుకున్న స్వాతిముత్యం చిరంజీవి తాకిడికి నిలవలేకపోయింది. బాగుందని అన్నా సరే జనం థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆపరేషన్ సక్సెస్ పేషేంట్ డెడ్ అన్నట్టు తయారయ్యింది దీని పరిస్థితి. విజయదశమికి ఎన్ని సెలవులు వచ్చినా సంక్రాంతి లాగా అన్ని సినిమాలు ఆడేసే స్కోప్ ఉండదు. ఒకవేళ జిన్నా కూడా బరిలో ఉంటే ఇప్పటికన్నా పరిస్థితి భిన్నంగా ఉండేది కాదు. పైగా మంచు మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ కామెడీ అనే హింట్ ఆల్రెడీ ట్రైలర్ తో పాటు ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఇచ్చేశాడు. ఇదేం వెరైటీ బ్యాక్ డ్రాప్ కాదు
సో ఎలా చూసుకున్నా జిన్నాకు ఆలస్యం అన్నిరకాలుగా కలిసి వస్తోంది. అలా అని కొత్త డేట్ మరీ అంత సేఫ్ అయితే లేదు. శివ కార్తికేయన్ ప్రిన్స్, కార్తీ సర్దార్, విశ్వక్ సేన్ వెంకటేష్ ఓరి దేవుడాతో పాటు భారీ హైప్ ఉన్న హాలీవుడ్ మూవీ బ్లాక్ ఆడమ్ కూడా రేస్ లో ఉంది. వీటిని తట్టుకుని నిలవడం అంత సులభం కాదు. మంచు విష్ణు నమ్మకంగా చెప్పినట్టు ఢీ, దేనికైనా రెడీలను మించే కంటెంట్ ఉంటే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. కామెడీతో పాటు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ గ్లామర్ ని పుష్కలంగా నమ్ముకున్న జిన్నా హీరో ఎప్పటి నుంచో కోరుకుంటున్న లాంగ్ బ్రేక్ ఇస్తాడా చూద్దాం
This post was last modified on October 9, 2022 10:40 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…