తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగి.. ఆ స్థానంలో ఉండగానే ఈ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్లాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఖైదీ నంబర్ 150 లాంటి బ్లాక్‌బస్టర్‌తో రీఎంట్రీ ఇచ్చాడు చిరు. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించాడాయన. ఈ నాలుగు సినిమాలు వేర్వేరు ఫలితాలను అందుకున్నాయి. ఫలితాల సంగతి పక్కన పెడితే అభిమానులు కోరుకున్న చిరంజీవి ఈ సినిమాల్లో కనిపించలేదన్నది మెజారిటీ మాట.
చిరు అంటే ఎంటర్టైన్మెంట్‌కు మారు పేరు. ఆయన్నుంచి ప్రధానంగా ఆశించేది వినోదమే. శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లోని సన్నివేశాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఆ వింటేజ్ చిరును మళ్లీ తెరపై చూడాలని ఉందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు.
ఐతే అభిమానుల నిరీక్షణకు తెరదించబోతున్నట్లు చిరు సంకేతాలు ఇచ్చేశారు. బాబీ దర్శకత్వంలో తాను చేస్తున్న కొత్త చిత్రం అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే ఉంటుందని ముందు నుంచి చిరు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లోనూ చిరు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాడు.
బాబీ గురించి మాట్లాడుతూ.. అతడి దర్శకత్వంలో తాను చేస్తున్న సినిమా రౌడీ అల్లుడును పోలి ఉంటుందని చిరు చెప్పాడు. గాడ్‌ఫాదర్‌లో ఉండే సటిల్‌నెస్ అందులో ఉండదని.. తన పాత్ర అల్లరల్లరిగా ఉండి సినిమా అంతా సందడిగా సాగుతుందని చిరు చెప్పాడు. ఇదొక కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అని చిరు సంకేతాలు ఇచ్చాడు. చిరంజీవికి ఒక అభిమానిగా తాను ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు బాబీ ముందు నుంచే చెబుతున్నాడు. అతడి ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేకపోయినా.. అభిమానులు కోరుకునేలా చిరును చూపిస్తే ఈ సినిమా బాక్సాఫీస్ విన్నర్‌గా నిలవడం ఖాయం. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 9, 2022 10:23 pm
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…