ఏ వ్యహారాన్నయినా తెగే దాకా లాగడం మంచిది కాదు. అందులోనూ అవతలి వాళ్లు తప్పు చేసి దొరికిపోయినపుడు, మన వైపు బలం ఉంది కదా అని అదే పనిగా టార్గెట్ చేయడం అన్నది కరెక్ట్ అనిపించుకోదు. ఒక స్థాయికి మించి దాడి చేస్తే అవతలి వ్యక్తి మీదే సానుభూతి మొదలవుతుంది. ఇప్పుడు ప్రవచనకారులైన పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విషయంలో అలాంటి ఫీలింగే కలుగుతోంది జనాలకు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో తాను అవధానం చెబుతుండగా చిన్న డిస్టబెన్స్ రావడంతో అభిమానులతో ఫొటోలు దిగుతున్న చిరును ఉద్దేశించి హెచ్చరిక ధోరణితో గరికపాటి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఐతే కొంచెం పరుషంగా మాట్లాడినప్పటికీ.. చిరు చాలా హుందాగా ప్రవర్తించి ఆయన్ని గౌరవించిన తీరు ప్రశంసలందుకుంది. ఐతే ఆ వివాదానికి చిరు అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టేయగా.. చిరు సన్నిహితులు, అభిమానులు కలిసి ఈ వివాదాన్ని తెగేదాకా లాగుతున్నారు.
ఇప్పటికే చిరు సోదరుడు నాగబాబు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన రచ్చ శ్రుతి మించింది. అది సరిపోదని ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ మీట్లో వరుసబెట్టి ఒక్కొక్కరుగా గరికపాటి మీద కౌంటర్లు వేయడం, చిరును కొనియాడడం చాలామందికి రుచించలేదు. గేయ రచయిత అనంత శ్రీరామ్ ‘గరిక’ అనే పదాన్ని వాడుతూ గరికపాటి గౌరవాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేయగా.. సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడేమో ‘వాడు’ అని సంబోధించేశాడు గరికపాటి వారిని. దర్శకుడు బాబి సైతం గరికపాటి మీద పరోక్ష విమర్శలు గుప్పించాడు. తాను చేసిందాని పట్ల గరికపాటి చిరు అభిమానుల దగ్గర ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
నిజానికి ఆయన చేసింది మహా పాపం అయితే కాదు. చిరును ఆయనేమీ దూషించలేదు కూడా. చేసిన చిన్న తప్పిదానికి ఆయన మీద ఈ స్థాయిలో ఇంతమంది అదే పనిగా దాడి చేయడం అన్నది కరెక్టా అని ఆలోచించాలి. ఆ సంఘటనలో చిరు ప్రవర్తన అందరినీ మెప్పించి ఆయనపై ప్రశంసలు కురిశాయి. అంతటితో ఈ వ్యవహారం ముగిసి ఉంటే చిరు ఉన్నత స్థాయిలో ఉండేవారు. కానీ అదే పనిగా గరికపాటి మీద ఇలా దాడి చేయడం ద్వారా చిరు గౌరవాన్ని తగ్గించి, ఆయనపై వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ వివాదానికి ఇంతటితో తెరదించడం మంచిది.
This post was last modified on October 9, 2022 3:42 pm
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…