పెద్ద సినిమాల విషయంలో స్టార్ హీరోలు దర్శకత్వ వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉంటారనేది రెగ్యులర్ గా వినే మాటే. ఈ కారణంగానే డిజాస్టర్లైన చిత్రాలు బోలెడు. ఆచార్య ఫలితం తేలాక చిరంజీవి మీద సైతం ఇలాంటి కామెంట్లు వచ్చాయి. కొరటాల శివను పని చేసుకోనివ్వలేదని, స్క్రిప్ట్ ని రకరకాలుగా మార్చమని ఒత్తిడి చేశారని, అందుకే అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందని ఏదేదో ప్రచారం జరిగింది. పొన్నియన్ సెల్వన్, ఆర్ఆర్ఆర్ లాంటివి హిట్ అయితే మణిరత్నం, రాజమౌళి ప్రతిభని పొగిడే సోషల్ మీడియా ఆచార్య రిజల్ట్ కు మాత్రం హీరోని టార్గెట్ చేయడం మీద మెగా ఫ్యాన్స్ ఫీలయ్యారు.
కట్ చేస్తే దీన్ని మనసులో పెట్టుకున్నారో లేక పదే పదే కొన్ని ఇంటర్వ్యూలలో దీని గురించి అడిగినందుకో ఏమో కానీ గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో దర్శకుడు మోహన్ రాజా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఎవరైనా ఇకపై మెగాస్టార్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారని కామెంట్ చేస్తే కొట్టేస్తానని, ఆయన అనుభవాన్ని వాడుకోకపోతే అది ముమ్మాటికి తమ తప్పే అవుతుంది తప్ప ఇలా అర్థం లేని విమర్శలు చేయడం మూర్ఖత్వమని తేల్చేశాడు. మొదలైనప్పటి నుంచి చివరి దాకా ప్రతి సన్నివేశంలో చిరు సలహాలు సూచనలు పొందే ఇంత గొప్ప అవుట్ ఫుట్ ఇచ్చానని నొక్కి చెప్పాడు.
నేరుగా పేర్లు ప్రస్తావించకపోయినా మోహన్ రాజా చేసిన కామెంట్లు అప్పుడే వీడియో రూపంలో వైరల్ అవుతున్నాయి. అతనన్న దాంట్లో నిజం లేకపోలేదు. గతంలోనూ ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ తీస్తున్న టైంలో చిరంజీవి సూచనలు మంచి ఎపిసోడ్లు రావడానికి ఎంతగా ఉపయోగపడ్డాయో పరుచూరి బ్రదర్స్ పలు సందర్భాల్లో చెప్పడం గుర్తే. మొత్తానికి తన ఇరవై ఏళ్ళ రీ ఎంట్రీకి తగిన అద్భుత ఫలితాన్ని అందుకున్న మోహన్ రాజా మాములు ఆనందంగా లేరు. అడిగినవారికి లేదనకుండా మూడు రోజుల నుంచి నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు.ఇంతపెద్ద సక్సెస్ దక్కినప్పుడు వచ్చే కిక్కు అలానే ఉంటుంది.
This post was last modified on October 9, 2022 10:47 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…