అదేంటి గాడ్ ఫాదర్ వల్లే ది ఘోస్ట్ వసూళ్లకు దెబ్బ పడిందని ఫ్యాన్స్ ఫీలవుతుంటే ఇదేం ట్విస్టనుకుంటున్నారా. ఇది నిజంగా నిజమే. హైదరాబాద్ లో జరిగిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. నిర్మాత ఎన్వి ప్రసాద్ పదిహేను నిమిషాల స్పీచులో చాలా విషయాలే బయట పెట్టారు. అందులో ఇది ముఖ్యమైనది. లూసిఫర్ రీమేక్ చేయాలని నిర్ణయించుకుని దర్శకుడు ఎవరైతే బాగుంటుందాని తర్జన భర్జన పడుతున్నప్పుడు చరణ్ తో సహా అందరి మదిలో మెదిలింది మోహన్ రాజానే. ధృవ ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన డైరెక్టర్ గా అతని మీద చిరంజీవికీ బోలెడు నమ్మకం.
సరేనని ఈ ప్రతిపాదన మోహన్ రాజా దగ్గరకు తీసుకెళ్లినప్పుడు అక్కడి నుంచి ముందు వచ్చిన సమాధానం నాగార్జున నూరో సినిమాకు అతను కమిట్ కావడంతో ఏం చేయాలనే దాని మీద తర్జనభర్జన పడ్డారు. దీంతో చిరంజీవి స్వయంగా నాగార్జునకు ఫోన్ చేయడం, ఆరు నెలలు తమకు రాజాను ఇస్తే గాడ్ ఫాదర్ పూర్తి చేసుకుంటామని చెప్పడం, స్నేహితుడు వెంటనే ఎస్ చెప్పడం జరిగిపోయాయి. కట్ చేస్తే ఇప్పుడా మిత్రుల మధ్య అండర్ స్టాండింగే గాడ్ ఫాదర్ సక్సెస్ కి మొదటి కారణంగా నిలిచింది. ఆ ఇద్దరిలో ఎవరూ ఇది ముందు చెప్పలేదు కానీ ఎన్వి ప్రసాద్ ఓపెన్ కావడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది.
సో కింగ్ వందో సినిమాకు దర్శకుడు మరోసారి అఫీషియల్ గా లాక్ అయ్యాడు. ది ఘోస్ట్ ఫలితంతో నిరాశలో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కి ఇది సూపర్ న్యూసే. మెగాస్టార్ ని ఎక్కువ డైలాగులు లేకుండా కేవలం కళ్ళు ఎక్స్ ప్రెషన్ల హీరోయిజంని ఎలివేట్ చేసిన తీరు చూసి తమ హీరోకూ ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు సిద్ధం చేసుంటాడన్న నమ్మకం వాళ్ళలో మొదలయ్యింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు విడుదల ఉండొచ్చనేది ఇప్పటికిప్పుడు చెప్పలేరు కానీ ల్యాండ్ మార్క్ మూవీకి సరైన దర్శకుడిని సెట్ చేసుకున్నారని చెప్పాలి. దీని తర్వాత ధృవ 2 తాలూకు పనులు మొదలవుతాయి. చరణ్, జయం రవిలతో ఒకేసారి రెండు భాషల్లో తీసే ఛాన్స్ ఉంది.
This post was last modified on October 9, 2022 1:34 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…