RRR సినిమా హిట్టయ్యాక మాంచి ఊపుమీదున్న రామ్ చరణ్ మాట్లాడితే మీడియాలో కనిపించేవాడు. పెద్దగా ప్రోగ్రామ్స్ కు రాకపోయినా కూడా ఎక్కడోచోట కనిపిస్తూ హల్చల్ చేసేవాడు. కాని ఆచార్య సినిమా బెడసికొట్టాక మాత్రం చరణ్ ఎందుకో బయటకు రావట్లేదు. ఆ సినిమా రిలీజయ్యాక శంకర్ సినిమా షూటింగులో బిజీగా ఉండి బయటకు రావట్లేదులే అనుకుంటే, గత రెండ్నెళ్ళ నుంచి #RC15 షూటింగ్ ఏదీ లేకున్నా, ఈ మెగా హీరో మాత్రం మొహం చాటేస్తున్నాడు. ఎందుకంటారు?
స్వయంగా తనే దగ్గరుండి లూసిఫర్ సినిమా రైట్స్ కొనేసి మరీ మెగాస్టార్ చిరంజీవికి అప్పజెప్పాడు కాని, సినిమాను ప్రమోట్ చెయ్యడానికి మాత్రం అసలు బయటకే రావట్లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. లూసిఫర్ సినిమా తెలుగులో తీస్తే హిట్టవుతుందని భావించి సదరు సినిమా రైట్స్ కొన్న చరణ్, మరి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో కనిపించకపోవడం మాత్రం కాస్త విడ్డూరమే. కనీసం గాడ్ ఫాదర్ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి ఏదన్నా స్పెషల్ ఇంటర్యూ అయినా చేస్తాడని అనుకుంటే, అలాంటి ఫీట్లను కూడా చరణ్ చెయ్యలేదు. అసలెందుకు ఇలా తెర వెనుకే ఉంటున్నాడనేది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ను కూడా కలవరపెడుతోంది.
మరో ప్రక్కన చస్తుంటే.. వరుస పెట్టి కొన్ని కొత్త బ్రాండ్లను సైన్ చేస్తున్న చరణ్, వాటి షూటింగ్ మరియు ప్లానింగ్ విషయంలో బిజీగా ఉన్నాడట. అందుకే ఇప్పుడు ఇతర ప్రాజెక్టులకు టైమ్ కేటాయించలేకపోతున్నాడని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఎంత బిజీగా ఉంటే మాత్రం కనీసం సక్సెస్ మీట్ కు రావడానికి కూడా కుదరదా ఏంటి? ఏదో బలమైన కారణం ఉండటం చేతనే ఈ మెగా హీరో బయట కనిపించట్లేదని కొన్ని రూమర్లు కూడా వస్తున్నాయ్.
This post was last modified on October 9, 2022 8:39 am
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…