రియా చక్రవర్తి.. ఒక చిన్నపాటి హీరోయిన్ గా కంటే ఆమెకు సుశాంత్ రింగ్ రాజ్పుత్ గాళ్ ఫ్రెండ్ గానే ఎక్కువ పేరొచ్చింది. అతగాడు చనిపోయిన తరువాత, డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళడంతో ఈమెకు ఇంకా పేరొచ్చేసింది. కాని సదరు కేస్ క్లియర్ అయ్యేంతవరకు అసలు బాలీవుడ్ ఆమెను పట్టించుకుని ఏవన్నా పెద్ద ఆఫర్లు ఇస్తోందా అంటే మాత్రం.. అబ్బే అక్కడంత సీన్లేదు. చివరకు అందాలను దారబోసినా కూడా, ఎందుకో ఆమెవైపు ఎవరి కళ్ళూ తిరగట్లేదు.
ప్రస్తుతం ఇనస్టాగ్రామ్ ను టార్గెట్ గా చేసుకుని తెగ రెచ్చిపోతోంది రియా. ఈ మధ్యకాలంలో ఆమె ఫోటోషూట్స్ చూసినోళ్లకి ఈ విషయం ఇట్టే అర్దమైపోతుంది కూడా. తన వయ్యారాలన్నీ కనిపించాలే ఫ్యాషన్ దుస్తులు ధరించి, అలాగే సెగలురేపే తన వగలన్నీ తగిలేలా కాస్త భారీగానే గ్లామర్ డోస్ వడ్డించి, అమ్మడు విరుచుకుపడుతోంది. ఆ మధ్యన తెలుగులో మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్ సరసన వచ్చిన ఛాన్స్ కూడా వాడుకోలేకపోయిన రియా, ఇప్పుడు తెలుగులో కూడా ఏదన్నా బ్రేక్ వస్తుందేమోనని తన ప్రయత్నిస్తోంది. కాకపోతే ఆమె హాట్ ఫోటోలకు లైక్స్ వస్తున్నాయ్ కాని, సినిమా ఆఫర్లు మాత్రం వచ్చి వళ్లో పడట్లేదు.
నిజానికి ఏదన్నా కాంట్రోవర్శీలో చిక్కుకున్న సెలబ్రిటీలంటే అందరికీ భయమే. అప్పటికే భారీ స్టార్డమ్ ఉన్న సల్మాన్ ఖాన్ ను కృష్ణజింక నుండి డ్రంక్ డ్రైవ్ కేస్ వరకు ఏదీ ఇబ్బంది పెట్టలేదు కాని.. జైలుకి వెల్లొచ్చాక సంజయ్ దత్ కెరీర్ దాదాపు స్మాష్ అయ్యింది. అలాగే కృష్ణజింక కేసులో ఉన్న సొనాలి బింద్రేకి కూడా ఆ తరువాత బాలీవుడ్ హ్యాండిచ్చింది. అలాంటి కేసుల్లో ఉన్నోళ్లకే ఇబ్బందులు తప్పనప్పుడు, ఏకంగా సుశాంత్ సింగ్ మృతికి ఈమె తెచ్చిన డ్రగ్సే కారణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. ఇక రియా జోలికి వెళ్లడానికి ఎవరు ఇష్టపడతారు?
ఆ కేసు తేలితే కాని ఆమెకు ఆఫర్ల ప్రవాహం వచ్చే ఛాన్సుండదు. ఈలోపు ఏమన్నా వచ్చినా కూడా, అవన్నీ చిన్నాచితకా సినిమాలే కాని, పెద్ద స్టార్స్ అయితే మాత్రం పిలిచే స్కోప్ లేదని అనిపిస్తోంది.
This post was last modified on October 9, 2022 8:36 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…