అక్కినేని నాగార్జున ఈ మధ్యన చాలా సినిమాలను బ్లాక్ బస్టర్స్ అవుతాయ్ అనే ఊహించుకున్నారు. ఆ మధ్యన వచ్చిన ఆఫీసర్ నుండి వైల్డ్ డాగ్ వరకు, ఇప్పుడు కొత్తగా ‘ది ఘోస్ట్’తో సహా.. ఖచ్చితంగా ఈ యాక్షన్ సినిమాలు ధియేటర్లలో ప్రకంపనాలు సృష్టిస్తాయని ఆయన ఆశించారు. కాని ఈ సినిమాలన్నీ ఫ్లాప్ కావడం ఆయన్ను చాలా నిరాశకు గురిచేశాయ్. అంతేకాదు, ఇప్పుడు ఘోస్ట్ తాలూకు ఇంపాక్ట రాబోయే అఖిల్ సినిమా మీద గట్టిగానే పడిందంటున్నారు సన్నిహితులు.
నిజానికి ఈ సంవత్సరం ఆగస్టు 15కి అఖిల్ కొత్త సినిమా ‘ఏజెంట్’ విడుదలవుతుందని అందరూ ఊహించారు. కాని దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం ఆ తరువాత ఒక టీజర్ తో సరిపెట్టేశాడు. అయితే అప్పట్లో వినిపించిన రూమర్లు ఏంటంటే.. ఏజెంట్ సినిమా ఎడిట్ వర్షన్ చూసిన నాగార్జునకు చాలా సీన్లు, అలాగే కథలో కొన్ని యాంగిల్స్ నచ్చలేదంట. దానితో ఆయన దాదాపు 30% సినిమాను రీషూట్ చేయాలని కోరినట్లు తెలిసింది. అదే సమయంలో నాగార్జున ‘ది ఘోస్ట్’లో తన ఇన్పుట్స్ చాలా ఉన్నాయ్ కాబట్టి, దీని రిజల్ట్ చూసి కొన్ని విషయాలపై డెసిషన్స్ తీసుకోవాలని ఏజెంట్ టీమ్ కు చెప్పారట. కాని ఈ సినిమాయే ఇప్పుడు బొక్కబోర్లా పడటంతో, ఏజెంట్ లో ఇప్పుడు చాలా కరక్షన్లు సూచించే ఛాన్సుందని అంటున్నారు ఫిలింనగర్ జనాలు.
నిజానికి దర్శకుడు సురేందర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే.. తనే సినిమాను మంచిగా తీర్చుదిద్దుతాడని చాలామంది అభిప్రాయం. అలా కాకుండా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విషయంలో చాలా టిప్స్ ఇచ్చి ఓవరాల్ గా సినిమాను ఒక బిలో యావరేజ్ ప్రొడక్ట్ తరహాలో తీర్చిదిద్దినట్లు, ఇప్పుడు నాగ్ కూడా అనవసరంగా ఏజెంట్ ను పాడుచేస్తున్నారా అనే సందేహం కూడా వస్తోంది. ఏదేమైనా కూడా ‘ది ఘోస్ట్’ మాత్రం నాగార్జునను ఘోస్ట్ తరహాలోనే వెంటాడుతుందేమో అనిపిస్తోంది కదూ?
This post was last modified on October 9, 2022 8:35 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…