సురేఖావాణి.. పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి తెలుగులో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించిన నటి ఆమె. ఒక దశలో ప్రతి పేరున్న సినిమాలో చిన్నదో, పెద్దదో ఒక క్యారెక్టర్ ఆమె చేస్తుండేది. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్లతో కలిసి ఆమె చేసిన సందడిని అంత సులువుగా మరిచిపోలేం. ఐతే కొంత కాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. ఉన్నట్లుండి ఫేడవుట్ అయిపోయి తెర మరుగైపోయింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె స్వాతిముత్యం సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో మెరిసింది. ఆమె పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్నే పంచింది. ఇందులో సురేఖా వాణిని చూసి ఏమైపోయింది ఇన్నాళ్లూ అని ప్రేక్షకుల ఆశ్చర్యపోయారు.
ఐతే తనకు ఎందుకు అవకాశాలు ఆగిపోయాయో తనకే తెలియడం లేదని ఈ సినిమా సక్సెస్ మీట్లో సురేఖ వ్యాఖ్యానించింది. తన వెనుక ఏదో జరిగి తనకు ఛాన్సులు తగ్గిపోయాయని ఆమె పేర్కొనడం గమనార్హం.
ఈ మధ్యకాలంలో.. సినిమాలు చేయడం లేదు.. సినిమాలు చేయండి.. అని చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా స్వాతిముత్యం సినిమాలో చేసినటువంటి పాత్రలు చేయండని అంటున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఇదే.. నా వరకు అవకాశాలు వస్తే కదా.. చేయడానికి. ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్ నా పాత్ర గురించి చెప్పడానికి వచ్చినపుడు ఈ క్యారెక్టర్‌కు ముందు నన్నే అనుకున్నావా అని అడిగాను. ఎందుకంటే ఈ మధ్య నా దగ్గరకి ఎవరూ రావడం లేదు. అందుకు కారణమేంటో నాకూ తెలియడం లేదు. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను.
సురేఖా వాణి సినిమాలు మానేసిందని, ఇంకా ఏదేదో అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ నేను సినిమాలు మానేయను. సినిమాలు చేస్తూనే ఉంటాను అని సురేఖా వాణి స్పష్టం చేసింది. మొత్తంగా సురేఖావాణి వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఎవరో తనకు అవకాశాలు రాకుండా కుట్ర చేస్తున్నారన్న అర్థం ధ్వనిస్తోంది.
This post was last modified on October 8, 2022 9:52 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…