స్వాతిముత్యం.. దసరా రేసులో నిలిచిన చిన్న సినిమా. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లాంటి పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ధైర్యంగా దఃసరా రేసులోకి వచ్చింది. కంటెంట్ మీద నమ్మకంతోనే తాము ఇంత ధైర్యం చేస్తున్నామని, ఇది దసరా సీజన్‌కు సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విడుదలకు ముందు చెప్పాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. అతడి మాటల్లో నిజం ఉంది. ఈ సినిమాలో విషయం ఉంది. ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
సరిగ్గా చెప్పాలంటే కంటెంట్ పరంగా ఈ దసరాకు బెస్ట్ మూవీ అంటే ‘స్వాతిముత్యం’యే. ‘ది ఘోస్ట్’ మూవీ ఎవరికీ రుచించలేదు. ‘గాడ్ ఫాదర్’ ఓకే అనిపించినా.. అది ఒక రీమేక్, పైగా కమర్షియల్ ఫార్మాట్లో సాగే సగటు మాస్ మూవీలా ఉంటుంది. ‘స్వాతిముత్యం’ అలా కాదు. ఇందులో కొత్త కథ ఉంది. కథానుసారం చక్కటి వినోదం ఉంది. అందుకే కంటెంట్ మాత్రమే చూస్తే ఇదే బెస్ట్ మూవీ.
ఐతే సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు బాగున్నాయి. అంతా ఓకే కానీ.. అందుకు తగ్గట్లుగా కలెక్షన్లు కనిపించడం లేదు. ఈ సినిమా షేర్ నామమాత్రంగా ఉండడంతో ఆ నంబర్స్ కూడా ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేయట్లేదు. చిత్ర బృందం కూడా వసూళ్ల గురించి మాట్లాడట్లేదు. తొలి రోజు నుంచి బుకింగ్స్ చూస్తే.. ఏ దశలోనూ ఆశాజనకంగా లేవు. ఫస్ట్ షోలకు మల్టీప్లెక్సుల్లో ఓ మోస్తరుగా ఆక్యుపెన్సీ ఉంటోంది. సింగిల్ స్క్రీన్ల బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు.
దసరా రేసులో వేరే పెద్ద సినిమాలున్నాయి కాబట్టి ‘స్వాతిముత్యం’పై జనాల దృష్టిపడడానికి కొంచెం సమయం పడుతుందని, వసూళ్లు నెమ్మదిగా పుంజుకుంటాయని అనుకున్నారు. కానీ అలాంటి పరిస్థితేమీ కనిపించడం లేదు. చూసిన వాళ్లందరూ మంచి సినిమా అంటున్నా సరే.. స్టార్ కాస్ట్ లేకపోవడం వల్లో, కొత్త హీరో బెల్లంకొండ గణేష్ సినిమాకు ఏం పోతాంలే అనో జనాలు అటు చూస్తన్నట్లు లేరు. ప్రధానంగా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం ‘గాడ్ ఫాదర్’ మీదే ఉండడం ‘స్వాతిముత్యం’కు చేటు చేస్తున్ట్లుంది.
This post was last modified on October 8, 2022 4:13 pm
టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు హెడ్ కోచ్ గా కూడా కొనసాగుతున్న…
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ కొత్త…
పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ బన్నీ చేయబోయే కొత్త సినిమా గురించి పరిశ్రమ, మీడియా వర్గాల్లో…
జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం…
ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత…