ఈ మధ్య ఒక్కొక్కరుగా తెలుగు స్టార్లు పాన్ ఇండియా లెవెల్‌కు తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. కొందరు ఉత్తరాదిన ప్లాన్ చేసి మార్కెట్ పెంచుకుంటుంటే.. కొందరికి అనుకోకుండా అక్కడ మార్కెట్ క్రియేట్ అవుతోంది. పుష్ప, కార్తికేయ-2 చిత్రాలతో అల్లు అర్జున్, నిఖిల్ సిద్దార్థలకు అనుకోకుండా అలాగే కలిసి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు ‘సైరా’ సినిమాతో ఉత్తరాదిన సత్తా చూపించాలని ప్రయత్నించారు కానీ.. ఆ చిత్రాన్ని అక్కడి వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఐతే ఈసారి చిరు ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. తన కొత్త చిత్రం ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్‌తో క్యామియో రోల్ చేయించారు. అది సినిమాకు బాగానే ప్లస్ అయినట్లుంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఉత్తరాదిన పర్వాలేదనిపిస్తోంది. మామూలుగా అయితే ఈ సినిమాను అసలు పట్టించుకునేవారు కాదేమో.
కానీ సల్మాన్ క్యామియో చేయడం, పోస్టర్ల మీద ఆయన బొమ్మ ప్రధానంగా కనిపించడంతో హిందీ ‘గాడ్ ఫాదర్’కు నార్త్ బెల్ట్‌లో వసూళ్లు పర్వాలేదన్నట్లుగా వస్తున్నాయి. సినిమా కూడా అక్కడి జనాలకు నచ్చుతున్నట్లే ఉంది. రెండో రోజు నుంచే సినిమాకు స్క్రీన్లు, షోలు పెరుగుతుండగా.. శనివారం అదనంగా మరో 600 థియేటర్లు జోడిస్తున్నట్లు స్వయంగా చిరంజీవి ఒక వీడియో ద్వారా ప్రకటించారు.
గత వారం విడుదలైన ‘విక్రమ్ వేద’ అనుకున్నంత ప్రభావం చూపించకపోవడం, ‘పొన్నియన్ సెల్వన్’ అసలేమాత్రం హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించకపోవడం ‘గాడ్ ఫాదర్’కు కలిసొచ్చింది. ఈ వారం విడుదలైన ‘గుడ్ బై’ కూడా క్లాస్ సినిమా కావడంతో సింగిల్ స్క్రీన్ల విషయంలో ‘గాడ్ ఫాదర్’కు ఇబ్బంది లేదు. దీంతో ఆ సినిమాకు అవసరమైనన్ని స్క్రీన్లు కేటాయిస్తున్నట్లున్నారు. మరి ఫుల్ రన్లో ‘గాడ్ ఫాదర్’ హిందీ వెర్షన్ ఏమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి.
This post was last modified on October 8, 2022 4:12 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…