టాలీవుడ్లో నిన్నటితరం టాప్ స్టార్లలో ఒకడు అక్కినేని నాగార్జున. ఐతే ఆయన తరంలో మిగతా టాప్ స్టార్ల పరిస్థితి మెరుగ్గానే ఉండగా.. నాగ్ మాత్రం తడబడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టాడు. ‘సైరా’తోనూ ఓకే అనిపించారు. ‘ఆచార్య’ డిజాస్టర్ అయినా.. వెంటనే పుంజుకుని ‘గాడ్ ఫాదర్’తో సత్తా చాటుతున్నారు. నందమూరి బాలకృష్ణ వరుసగా కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నప్పటికీ ‘అఖండ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఇక విక్టరీ వెంకటేష్ నిలకడగా విజయాలు అందుకుంటూనే ఉన్నాడు. ‘ఎఫ్-2’తో కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు.
కానీ నాగార్జున మాత్రం నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో 2016లో బ్లాక్‌బస్టర్ అందుకున్నాక నాగ్‌కు సరైన విజయం లేదు. ఏ హీరోకైనా ఫ్లాపులు సహజమే కానీ.. నాగ్ పరిస్థితి మాత్రం ఘోరం. ‘ఆఫీసర్’ సినిమా చేసి తన మార్కెట్‌ను దారుణంగా దెబ్బ తీసుకున్న నాగ్.. ఆ తర్వాత పుంజుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించలేదు.
సినిమా సినిమాకూ నాగ్ మార్కెట్ పడిపోతుండడం.. కనీసం ఓపెనింగ్స్ కూడా కరవైపోతుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ‘వైల్డ్ డాగ్’ ఆడలేదంటే కరోనా కారణం చెప్పారు కానీ.. ఇప్పుడు ‘ది ఘోస్ట్’ దసరా సీజన్లో రిలీజై కూడా ఓ మోస్తరు స్థాయిలోనూ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో పరిస్థితి మరీ కష్టంగా ఉంది. ఫుల్ రన్లో ఆరేడు కోట్లకు మించి షేర్ వచ్చేలా లేదు.
ఒకప్పుడు మిగతా స్టార్లతో సమానంగా తిరుగులేని విజయాలందుకున్న నాగ్.. ఇప్పుడీ పరిస్థితి రావడం అనూహ్యం. ఆయనేమీ యంగ్ హీరోలకు పోటీగా నిలవాల్సిన పని లేదు. కానీ తన తరం స్టార్లకు ఏమాత్రం దీటుగా నిలవలేకపోతున్నాడు. పెద్దగా ఇమేజ్ లేని హీరోలకు, ఆయనకు తేడా లేకపోతోంది. కెరీర్లో అతి పెద్ద మైలురాయి అయిన వందో సినిమా ముంగిట నాగార్జున ఈ స్థితిలో ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వందో సినిమాకు అయినా క్రేజ్ వస్తుందా అన్నది సందేహంగానే ఉంది.
This post was last modified on October 8, 2022 3:19 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…