Movie News

వామ్మో.. సూర్య సినిమా డిజిట‌ల్ వంద కోట్లా?


త‌మిళ స్టార్ హీరో సూర్య నిఖార్స‌యిన హిట్ కొట్టి చాలా కాల‌మే అయింది. అత‌డి చివ‌రి థియేట్రిక‌ల్ రిలీజ్ ఈటి డిజాస్ట‌ర్ అయింది. దానికి ముందు అత‌డి నుంచి వ‌చ్చిన సూరారై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా) ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న తెచ్చుకుంది కానీ.. అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావ‌డం, థియేట్రిక‌ల్ రిలీజ్ లేక‌పోవ‌డం వ‌ల్ల దాని స‌క్సెస్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేం. జై భీమ్ సినిమా ప‌రిస్థితి కూడా అంతే. అంత‌కుముందు వ‌రుస‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రాజ‌యాలే ఎదుర‌య్యాయి సూర్య‌కు.

ఐతేనేం అత‌డి కొత్త సినిమాల‌కు క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమాతో పాటు శౌర్యం శివ డైరెక్ష‌న్లో చేయ‌బోయే సినిమాకు కూడా హైప్ ఒక రేంజిలో ఉంది. శివ‌-సూర్య సినిమా ఈ మ‌ధ్యే సెట్స్ మీదికి వెళ్లింది. దాని షూటింగ్ ఆరంభ ద‌శ‌లోనే ఉంది. అప్పుడే దానికి డిజిట‌ల్ డీల్ పూర్త‌యిన‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి.

సూర్య 42వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీకి ఏకంగా రూ.100 కోట్ల‌కు డిజిట‌ల్ డీల్ కుదిరింద‌ట‌.ఒక ప్ర‌ముఖ ఓటీటీ ఈ చిత్ర డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసిన‌ట్లు త‌మిళ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. వ‌రుస‌గా హిట్లు కొడుతున్న హీరోల సినిమాల‌కు కూడా లేని డిమాండ్ సూర్య చిత్రాల‌కు ఉంద‌ని.. అత‌డి సినిమాల డిజిట‌ల్ రీచ్ వేర‌ని, అందుకే వాటి కోసం ఓటీటీలు ఎగ‌బ‌డుతున్నాయ‌ని సూర్య అభిమానులు అంటున్నారు.

విక్ర‌మ్ మూవీలో చిన్న క్యామియోతోనే థియేట‌ర్ల‌ను షేక్ చేసిన సూర్య‌.. శివ లాంటి మాస్ డైరెక్ట‌ర్‌తో జ‌ట్టు క‌ట్ట‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇది చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న భారీ క‌థ‌తో తెర‌కెక్కుతుండ‌డం విశేషం. సూర్య స‌ర‌స‌న దిశా ప‌టాని న‌టిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

This post was last modified on October 8, 2022 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…

4 minutes ago

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

8 minutes ago

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

11 minutes ago

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago