Movie News

ఈ ఆడియన్స్ ఏంటండీ.. పండగలకీ హ్యాండేనా?

ఏ హాలిడే లేకుండా ఒక నార్మల్ శుక్రవారం నాడు రిలీజై.. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా.. ఒకప్పుడు మొదటి మూడురోజుల్లో పెద్ద హీరోలకు 50 కోట్ల కలక్షన్ వచ్చేసిది. ఇప్పుడు డైరక్టుగా దసరా వంటి పెద్ద పండుగలకు రాష్ట్రమంతా సెలవులు ఉన్న టైములో రిలీజ్ చేస్తే కూడా.. మెగాస్టార్ గాడ్‌ ఫాదర్ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 13 కోట్లు షేర్ వచ్చిందంతే. ఈ ఫిగర్స్ చూశాక అసలు ఏం జరుగుతోంది అనే సందేహం అందరికీ వచ్చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లోకొచ్చి ‘ఖైదీ నెం 150’ అంటూ ఒక రీమేక్ తో వస్తే.. ఏకంగా తొలిరోజున 23+ కోట్లు షేర్ వచ్చేసింది. ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత ఏకంగా 10 కోట్లు తగ్గిపోయిందంటే.. ఖచ్చితంగా ఆడియన్స్ చేంజ్ అయిపోయారనే చెప్పాలి. ఒకప్పుడు సెలవుల్లో ఎంటర్టయిన్మెంట్ కేవలం సినిమా ఒకటే ఉండేది. సినిమా టాక్ తో పనిలేకుండా అందరూ పొలోమని ధియేటర్లకు వెళ్ళిపోయేవారు. టాక్ ఎలా ఉన్నా కూడా మొదటిరోజు కలక్షన్లు కుమ్మేశేవి. ఇప్పుడు మాత్రం అలాంటి సందడి ఎక్కడా కనిపించలేదు.

ఇలా జరగడానికి ఫస్ట్ అడ్డంకి టిక్కెట్ రేట్ అనే చెప్పాలి. మినిమం టిక్కెట్ రేటు 300 అంటే.. ఒక చిన్న ఫ్యామిలీ ధియేటర్ కు వెళ్ళి 1500-2000 ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఒకప్పుడు ఫ్యామిలీ అంతా సినిమాకెళితే ఒక ఐదొందల నోటు మారిస్తే సరిపోయేది. సంవత్సరానికి నాలుగుసార్లు ఒక ఫ్యామిలీ ధియేటర్ కు వెళ్ళాలన్నా కూడా.. 6-8 వేలు ఖర్చుపెట్టాల్సిందే.ఇప్పుడు అదే ఫ్యామిలీకి 1000 రూపాయల్లో 4కె క్వాలిటీ స్ట్రీమింగ్ ఇచ్చే యాప్ సంవత్సర సబ్ స్ర్కిప్షన్ వచ్చేస్తోంది. ఎలాగో రెండు నెలల్లో ఈ పెద్ద సినిమా యాప్ లో వస్తోంది కాబట్టి, జనాలు ఆ డబ్బులు ఇటు పెట్టేస్తున్నారు. పైగా తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ రోజూ సినిమా చూస్కోవచ్చు.

ఇకపోతే డబ్బులకు ఇబ్బందిలేని మిడిల్ క్లాసోళ్ళు.. 50వేల రూపాయలకి దొరుకుతున్న 55 ఇంచెస్ టివిని EMI పద్దతిలో కొనుక్కుని.. ఏదో ఒక ఓటిటిలో వరల్డ్ సినిమాను చూస్తున్నారు. ఇంట్లో అందరూ కలసి చూస్తే అది కూడా ఒక చిన్న ధియేటర్ ఫీలింగే వస్తుండటంతో.. ఎక్కువ ఫ్యామిలీస్ ఇదే బాటలో వెళ్తున్నాయ్.

ఆడియన్స్ ఎటువంటి సినిమాలను చూస్తున్నారు అనేదే కాదు.. అసలు ఆడియన్స్ సినిమాను ధియేటర్లో కాకుండా ఇంకా ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తిస్తే.. సెలవుల్లో కూడా పెద్ద హీరోల పప్పులు ఎందుకు ఉడకట్లేదో మనకు ఇట్టే అర్దమవుతోంది. ట్రెండ్ బాగా మారిపోయింది కాబట్టి.. మన హీరోలు కూడా ఒక సినిమాను ధియేటర్లోనే చూడాలి అనేంత రేంజులో తియ్యాలి. అప్పుడు జనాలు వచ్చి ఎంజాయ్ చేసే ఛాన్సుంది. లేదంటే సెలవులొచ్చినా రాకపోయినా.. ప్రేక్షకులు హ్యాండిస్తారంతే.

This post was last modified on October 8, 2022 10:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘గేమ్ ఛేంజర్’లో తెలుగు రాష్ట్రాల సంఘటనలు : దిల్ రాజు!

అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…

20 minutes ago

పుష్ప-2 బాక్సాఫీస్ : బాహుబలి రికార్డు బ్రేక్ అయ్యేనా??

ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…

41 minutes ago

ఫ్యాన్స్ కోరుకున్న ‘ధోప్’ స్టెప్పులు ఇవే చరణ్!

ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…

1 hour ago

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

5 hours ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

13 hours ago