Movie News

RRR.. ఆ నామినేషన్ కాస్త ఓవరేమో?

RRR సినిమాకు ఆస్కార్ నామినేషన్లు వస్తాయో రావా అనేది తర్వాతి సంగతి కాని, అసలు ఇండియా నుండి ఒక సినిమాను ఏకంగా డజనకు పైగా కేటగిరీల్లో ఆస్కార్ కు నామినేట్ చేయడం కోసం ప్రయత్నించడం అనేది మాత్రం చాలా పెద్ద విషయం.

అది కేవలం లెజండ్ రాజమౌళికి మాత్రమే సాధ్యపడే అంశం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సినిమాను దాదాపు అన్ని క్యాటగిరీల్లోనూ నామినేట్ చేసేశారు కాబట్టి, ఏదో ఒక క్యాటగిరీలో నామినేషన్ దక్కినా ఆనందమే. కాని ఒక నామినేషన్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో బాగా కామెడీకి గురవుతోంది.

నిజానికి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్‌ బెస్ట్ యాక్టర్స్ గా నామినేట్ చేయడం, రాజమౌళికి బెస్ట్ డైరక్షన్, అలాగే RRR సినిమాకు బెస్ట్ సినిమాగా నామినేన్ అనేది అన్నింటికంటే ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ అనే చెప్పాలి. కాని RRRలో చేసిన ఆ చిన్న రోల్ కు.. ఆలియా భట్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ క్యాటగిరీలో నామినేషన్ వస్తుందని ప్రయత్నించడం మాత్రం కాస్త కామెడీగానే ఉంది. ఆలియా మంచి నటీమణే. ఈ మధ్యకాలంలో గంగూభాయ్ వంటి సినిమాల్లో తన నటవిశ్వరూపం చూపించింది.

కాని RRRలో చేసిన పాత్రకు మాత్రం అంత సీనైతే లేదు. అదీ కూడా ఆస్కార్ కు నామినేట్ అయ్యే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ రోల్స్ ను చూస్తే.. కథను ఒక రేంజులో మార్చేసే పాత్రలకు, అలాగే ప్రేక్షకులను మైండ్ బ్లోయింగ్ గా తెరకు కట్టిపాడేశే పాత్రలకే ఆ నామినేషన్ ఇస్తారు. ఇంకా చెప్పాలంటే ఉన్న కాస్తలో ఆలియా భట్ కంటే కూడా శ్రీయ చేసిన షార్ట్ రోల్ కాస్త బాగుంటుంది అనుకోవచ్చు. అందుకే ఈ నామినేషన్ గురించి నెటిజన్లు కూడా కామెడీ చేస్తున్నారు.

అదే తరహాలో RRRలో మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా హాలీవుడ్ తో కంపేర్ చేస్తే కాస్త తక్కువే. ఎవెంజర్స్ వంటి సినిమాల్లో రచ్చలేపే గ్రాఫిక్స్ ఉన్నా కూడా ఆ సినిమాలను ఒక్కోసారి విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలో నామినేట్ చెయ్యరు. సర్లేండి.. ఏదేమైనా కూడా అసలు అన్ని క్యాటగిరీల్లో నామినేషన్ కు ప్రయత్నించడమే పెద్ద విషయం. మొత్తంగా RRR సినిమాకో, రాజమౌళికో నామినేషన్ వస్తే మాత్రం.. అంతకంటే ఆనందమైనా విషయం ఉండదు.

This post was last modified on October 8, 2022 7:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వార్ 2 పేరు మార్పా…ఛాన్సే లేదు

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ కలయికలో రూపొందుతున్న వార్ 2 ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చేశాక…

2 hours ago

సలార్ ప్రపంచంలోకి కొండవీటి దొంగ వస్తే

https://www.youtube.com/watch?v=O38mUkgL-w8 దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయకపోయినా కథను ఇచ్చాడన్నా చాలు ఆ సినిమా మీద అంచనాలు పెరుగుతాయి. అందులోనూ…

2 hours ago

విశ్వక్సేన్‌ను నమ్మొచ్చా?

టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరోల్లో విశ్వక్సేన్…

2 hours ago

2 గంటలు 21కి.మీ.: దేశంలోనే టాప్ ఫిట్ నెస్ సీఎం ఆయనే!

అవును.. రెండే రెండు గంటల్లో 21 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తటం కొందరు క్రీడాకారులకు.. మారథాన్ లో పాల్గొనే వారికి పెద్ద…

4 hours ago

హీరో డైరెక్షన్.. కమెడియన్ హీరో

హీరోలు డైరెక్షన్ చేయడం కొత్తేమీ కాదు. ఎన్టీ రామారావు నుంచి విశ్వక్సేన్ వరకు తెలుగులో మెగా ఫోన్ పట్టిన హీరోలు…

4 hours ago

వైసీపీకి భారీ షాక్‌: అస్త్ర స‌న్యాసంలో న‌లుగురు ఉద్ధండులు

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాయ‌కులు ఒక్కొక్క‌రుగా కాదు.. మూకుమ్మ‌డిగానే ఆ పార్టీని వ‌దిలేస్తున్నారు. ఈ…

5 hours ago