నిజమే, పొన్నియన్ సెల్వన్ 1 సినిమాకు ఏకంగా 300 కోట్ల కలక్షన్ వచ్చేసింది. అందులో 80% పైచిలుకు కలక్షన్ తమిళ వెర్షన్ నుండి వచ్చిందే. కాని ఆదిపురుష్ సినిమా టీజర్ కు వచ్చిన ట్రాలింగ్ గురించి ప్రస్తావించిన దిల్ రాజు, పెద్ద తెర మీద విజువల్ ఫీస్ట్ ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో పొన్నియన్ సెల్వన్ నిరూపించింది కదా అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇప్పుడు ఆల్ టైమ్ బెస్ట్ కామెడీ అయిపోతోంది. ఎందుకంటే PS1 ఎందుకు ఆడుతుందో తెలుసుకోలేనంత అమాయక ప్రజాలు ఇప్పుడెక్కడున్నారు చెప్పండి?
విజువల్స్ అద్భుతంగా ఉండటం వలనే పొన్నియన్ సెల్వన్ కుమ్మేస్తుంటే.. ఆ కుమ్ముడు తెలుగులోనూ బాలీవుడ్లోనూ కనిపించేది కదా.? కాని ఇక్కడ అంత సినిమా లేదు. మణిరత్నం మీద అభిమానంతో.. అలాగే ఆ స్టార్ క్యాస్ట్ చూసి.. మన దగ్గర మ్యాగ్జిమం ఒక 10 కోట్ల షేర్ వచ్చే ఛాన్సుంది. హిందీలో అయితే సినిమా అసలు అత్తపత్తా లేకుండా పోయింది. మరి విజువల్స్ బాగుంటే సినిమా ఎందుకు ఆడట్లేదు? విజువల్స్ అంత బాగుంటే ఇక్కడ తెలుగులో కూడా కెజిఎఫ్ లేదా విక్రమ్ సినిమాల తరహాలో కుమ్మేసి వదిలేయాలి. ఇప్పుడు దిల్ రాజ్ చేసిన కామెడీ చూశాక ఈ ప్రశ్నను ఆయన్ను ఎవరైనా అడిగితే బాగుండు అనిపిస్తోంది కదూ.
తమిళంలో పొన్నియన్ సెల్వన్ అక్కడి రాజు చరిత్ర అంటూ గాట్టిగానే ప్రచారం చేశారు. పైగా అక్కడ శైవులు ఎక్కువ. వాళ్లకు రాజరాజ చోళ అంటే.. మహారాష్ట్రలో శివాజీని ఎలాగైతే శివాజీ మహారాజ్ అంటూ దేవుడ్ని చేసేశారో.. అదే తరహాలో తమిళులకు కూడా రాజరాజ చోళ దాదాపు గాడ్ అనే చెప్పాలి.
అందుకే ఆయన కథేంటో తెలుసుకుందాం అని సినిమాకు ఒక్కొక్కరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. రేపు ప్రభాస్ చేసిన ఆదిపురుష్ కు కూడా.. రామాయణం చూద్దాం అని ధియేటర్లకు ప్రేక్షకులు భారీగా వచ్చే ఛాన్సుంది. అంతమాత్రాన సినిమా విజువల్స్ అదిరిపోయాయ్ అనుకుంటే ఎలా? ఒక్కోసారి విజువల్స్ కంటే ఎమోషన్ కే ఎక్కువ బేరం ఉంటుంది రాజు గారూ!!
This post was last modified on October 8, 2022 7:34 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…