పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం పర్లేదనిపించినప్పటికీ పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ సేన్ ఈసారి విక్టరీ వెంకటేష్ సహాయం తీసుకున్నాడు. తమిళ హిట్ మూవీ ఓ మై కడవులేకి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఓరి దేవుడా ఈ నెల 21న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్వత్ మారిముత్తునే దీనికి దర్శకుడు. చాలా గ్యాప్ తర్వాత పివిపి నిర్మాణంలో వస్తున్న ఎంటర్ టైనర్ ఇది. ఇందాక గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు. మొన్నటిదాకా దీని మీద పెద్దగా బజ్ లేదు కానీ వెంకీ క్యామియో కన్ఫర్మ్ అయ్యాక అంచనాలు పెరిగాయి.
స్టోరీ పాయింట్ వెరైటీగా తోస్తోంది. స్నేహితురాలినే పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అతను ఆశించినంత అందంగా జీవితం లేకపోగా చిత్ర విచిత్రమైన గొడవలతో సతమతమవుతూ ఉంటాడు. ఈలోగా గతంలో ఇష్టపడిన అమ్మాయి ఇతనికి తారసపడుతుంది. కట్టుకున్న దానికేమో సవాలక్ష అనుమానాలు. ఈ పోరు పడలేక సతమతమవుతున్న అర్జున్ (విశ్వక్ సేన్)మొర విని ఏకంగా దేవుడే వచ్చేస్తాడు. ఊహించని ఒక ఆఫర్ ఇస్తాడు. దీంతో లైఫ్ టర్న్ అవుతుందనే గ్యారెంటీతో అర్జున్ ఒప్పుకుంటాడు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, ప్రేమికుడితో దేవుడి ఫ్రెండ్ షిప్ ఎలా కుదిరింది ఇదంతా తెరమీదే చూడాలి.
సినిమాలో విషయముందనే అభిప్రాయమైతే దీంతో కలిగించారు. ఎఫ్3 తర్వాత గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుందేమోనని టెన్షన్ పడిన దగ్గుబాటి ఫ్యాన్స్ కి రిలీఫ్ కలిగేలా వెంకీని మంచి పాత్రలో చూసే అవకాశం దక్కింది. తమిళ్ లో ఇది విజయ్ సేతుపతి చేయగా కన్నడలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పోషించారు. లక్కీ మ్యాన్ గా రూపొందిన ఈ మూవీ కర్ణాటకలో ఓ మాదిరిగా ఆడింది. ఈ వారమే ఓటిటిలో వచ్చింది. అయితే వాళ్ళిద్దరికీ కామెడీ టైమింగ్ పరంగా వెంకటేష్ కు చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మంచి అవుట్ పుట్టే ఆశించొచ్చు. దీపావళికున్న గట్టి పోటీలో ఎక్కువ ఎడ్జ్ దీనికే కనపడుతోంది.
This post was last modified on October 8, 2022 11:53 am
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…