Movie News

రావణుడి లుక్‌పై ‘ఆదిపురుష్’ దర్శకుడేమన్నాడంటే..

గత ఆదివారం రోజు ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి దాని మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇందులోని విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు రావణుడు, ఆంజనేయుడు పాత్రలకు సంబంధించిన లుక్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

రావణుడు, ఆంజనేయుడు పాత్రల వేషధారణ విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు, హిందూ వర్గాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఐతే ఒక హిందీ టీవీ ప్రోగ్రాంలో దర్శకుడు ఓం రౌత్ ఈ విమర్శలన్నింటి మీదా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రామాయణ గాథను ఇప్పటి యువతరం, పిల్లలకు అర్థమయ్యేలా, వారి అభిరుచికి తగ్గట్లు చెప్పాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని అతను వివరించాడు.

రామాయణ గాథను గతంలో అనేక సినిమాలు, సీరియళ్లలో అప్పటి ట్రెండుకు తగ్గట్లు చూపించారని.. ఐతే ఇప్పటి ప్రేక్షకులు హారీ పోర్టర్ లాంటి హాలీవుడ్ సినిమాలకు అలవాటు పడ్డారని.. వారిని ఆకట్టుకోవడానికి రామాయణ గాథను ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్‌గా చూపించే ప్రయత్నమే ‘ఆదిపురుష్’లో జరిగిందని అతను వివరించాడు. రావణుడు అంటే రాక్షసుడు, చెడుకు ప్రతీక అని.. ప్రస్తుత కాలంలో ఒక చెడ్డ వ్యక్తి ఎలా ఉంటాడనే ఊహతో ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు ఓం రౌత్ తెలిపాడు.

ఇక రావణుడి వాహనం పుష్పక విమానం కదా.. మరి హాలీవుడ్ సినిమాల్లో కనిపించే పక్షి మీద రావడం ఏంటనే విమర్శలకు బదులిస్తూ.. పుష్పక విమానం మీదే రావణుడు విహరించినట్లు ఎక్కడా ఆధారం లేదని.. ఆ కాలంలో రకరకాల క్రియేచర్స్ ఉండేవని.. ఎవరి విజన్‌కు తగ్గట్లు వాళ్లు వాటిని చూపించవచ్చని.. ‘ఆదిపురుష్’ సినిమా రామాయణానికి మోడర్న్ వెర్షన్ లాగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో తాము చేసిన ప్రయత్నం ఇదని ఓం రౌత్ వివరించాడు. ‘ఆదిపురుష్’ ప్రధానంగా పిల్లలు, యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా ఇదని, వారి అభిరుచికి తగ్గట్లు మోడర్న్ స్టయిల్లో సినిమాను తీర్చిదిద్దామని అతను తెలిపాడు.

This post was last modified on October 7, 2022 2:36 pm

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 minutes ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

9 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

11 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

11 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

12 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

15 hours ago