ఈ మధ్యకాలంలో మన స్టార్ హీరో హీరోయిన్లు రా ఏజెంట్లుగా నటించేందుకు తెగ ఉత్సాహపడుతున్నారు. ఇప్పుడు సమంతా కూడా ఈ రేస్ లో చేరనుంది. అయితే స్ట్రెయిట్ తెలుగులో కాదులెండి. బాలీవుడ్ లో చేస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ ఇండియాలో భీభత్సమైన యాక్షన్లు ఛేజులు చేసే ఆఫీసర్ గా సరికొత్తగా కనిపించబోతున్నట్టు ముంబై టాక్. అయితే ఇది ఓటిటి వెబ్ సిరీస్. ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ అండ్ డికెలు దీన్ని రూపొందించబోతున్నారు. అవెంజర్స్ సృష్టికర్తలు రస్సో బ్రదర్స్ ఇచ్చిన కథ ఆధారంగా ఈ స్క్రిప్ట్ తయారుచేశారని ఇన్ సైడ్ టాక్.
దీని కథ మొత్తం 90 దశకంలో సాగుతుంది. బడ్జెట్ కూడా భారీగా కేటాయించబోతున్నారు. ప్రస్తుతం షూటింగుల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న సామ్ నవంబర్ లేదా డిసెంబర్ నుంచి దీనికి సంబందించిన వర్క్ షాప్స్ లో పాల్గొనబోతోంది. విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి తాలూకు బ్యాలన్స్ పార్ట్ తో పాటు యశోద ప్రమోషన్లకు తగినంత సమయం ప్లాన్ చేసుకున్నాక సిటాడెల్ ఇండియా కోసం రంగంలోకి దిగుతుంది. అయితే ఇది వచ్చే ఏడాది స్ట్రీమింగ్ జరిగే ఛాన్స్ లేదు. 2023ని టార్గెట్ గా పెట్టుకుని రాజ్ అండ్ డికెలు వర్క్ చేస్తున్నారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన సిరీస్ ఇదేనట
దీని ఒరిజినల్ అమెరికన్ వెర్షన్ లో ప్రియాంకా చోప్రా చేసిన పాత్రనే మన ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు మార్చుకుని సమంతాను చూపించబోతున్నారు. వరుణ్ ధావన్ కు సైతం ఇదే ఓటిటి డెబ్యూ. ఈ మధ్య సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ ల నిర్మాణం మన దేశంలో ఊపందుకుంటోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంది. అవసరమైతే వందల కోట్ల ఖర్చుకి సైతం ఓకే చెబుతోంది. నెట్ ఫ్లిక్స్ కొంత స్పీడ్ తగ్గించినప్పటికీ రాబోయే ఆరు నెలల్లో భారీ కంటెంట్ తో గట్టి పోటీకి రెడీ అయ్యింది. హాట్ స్టార్ సైతం తక్కువ తినలేదు. మొత్తానికి సినిమాకు సమాంతర ప్రత్యాన్మాయంగా వెబ్ సిరీస్ లు ఎదుగుతున్న మాట వాస్తవం
This post was last modified on October 7, 2022 1:21 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…